EPFO claim Limit: శుభవార్త! PF ఆటో క్లెయిమ్ పరిమితి పెంచిన ఈపిఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగి ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ఓ తాజాగా ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ సదుపాయానికి సంబంధించిన పరిమితిని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. అంతే కాకుండా, ఇల్లు నిర్మాణం,పెళ్లి ఖర్చుల కోసం అడ్వాన్స్ తీసుకునే వారిపై కూడా ఈ సదుపాయం వర్తించనుంది. ఈ నిర్ణయంతో 27.74 కోట్ల మంది ఉద్యోగులు లాభపడతారు. 'ఈజ్ ఆఫ్ లివింగ్' అనే దృష్టితో, EPF స్కీమ్, 1952 నాటి ఆర్టికల్ 68K (విద్య, వివాహ ప్రయోజనం), ఆర్టికల్ 68B (గృహ ప్రయోజనం) కింద అన్ని క్లెయిమ్‌లకు ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పద్ధతి వర్తిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.15 కోట్ల క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పరిష్కరించబడ్డాయి.
CBT 236వ సమావేశంలో, EPFO కొత్త పథకాలు
ఇటీవల, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్‌సుఖ్ మాండవ్య అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 236వ సమావేశంలో, EPFO కొత్త పథకాలను ప్రకటించింది. ఇందులో, ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని పెంచినట్లు తెలియజేసారు. ఇంకా, ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ELI) స్కీమ్ ప్రయోజనాలను 28 ఏప్రిల్ 2024లో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద కనిష్ట బీమా ప్రయోజనం రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 7 లక్షలు వరకు ఉంటాయి. ELI పథకంలో, ఉద్యోగి మరణం వల్ల వారి కుటుంబ సభ్యులకు బీమా రక్షణ అందించబడుతుంది.