
Phone EMI : ఈఎంఐ మిస్ అయితే ఫోన్ ఆటోమేటిక్ లాక్.. ఆర్బీఐ పరిశీలనలో కొత్త ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
ఈఎంఐలో తీసుకున్న మొబైల్ ఫోన్ లోన్స్ డిఫాల్ట్‌లను తగ్గించేందుకు ఫైనాన్స్ కంపెనీలు ఓ కొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నాయి. కంపెనీలు ప్రతిపాదించిన విధానం ప్రకారం, మొబైల్ కొనేటప్పుడు ఫోన్‌లో ఒక ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని ఆర్ బి ఐ అనుమతి కోరుతున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఈఎంఐ మిస్ చేసినా, ఆటోమేటిక్‌గా ఫోన్ లాక్ అయ్యేలా చేయడం లక్ష్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఈ విధానాన్ని అనుమతించాలా లేదా అని పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ రూల్ అమలులోకి వస్తే, ఎంఐ మిస్ అయిన డేట్ నుంచి పేమెంట్ క్లియర్ అయ్యే వరకు మొబైల్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే అవకాశం ఉంది.
Details
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కష్టాలు
అయితే, ఈ విధానం ద్వారా ఉపయోగదారుల డైలీ లైఫ్ యాక్టివిటీస్ దెబ్బతినే అవకాశం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కష్టాలు ఏర్పడుతాయని లాయర్లు వాదిస్తున్నారు. ఈ సవాలును దృష్టిలో ఉంచి, ఒకవేళ రూల్ అమలు లోకి వచ్చినా, ఫోన్-లాకింగ్ విధానాలపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్ల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం, అలాగే లాకింగ్ యాప్ ద్వారా వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.