Page Loader
IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల 
ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల

IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 03, 2024
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT బాంబే)లో ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో, తాజా గ్రాడ్యుయేట్‌లకు అందించే కనీస వేతన ప్యాకేజీ భారీ తగ్గడం కలకలం రేపుతోంది. ఈ ప్లేస్‌మెంట్ సమయంలో కనీస జీతం సంవత్సరానికి రూ. 4 లక్షలకు పడిపోయింది. సాధారణంగా IIT గ్రాడ్యుయేట్‌లకు అందించే ప్యాకేజీలకు తక్కువగా ఉండటం విశేషం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా విద్యార్థులను తీసుకున్న కంపెనీల సంఖ్య తగ్గిందని ఐఐటీ బాంబే ధ్రువీకరించింది.

Details

 పది మంది విద్యార్థులు ఏడాదికి రూ. 4 లక్షల నుండి రూ. 6 లక్షల 

ఈ ఏడాది పది మంది విద్యార్థులు సంవత్సరానికి రూ. 4 లక్షల నుండి రూ. 6 లక్షల మధ్య జీతం ఆఫర్‌లను అంగీకరించారు. సాధారణంగా IIT బాంబే నుండి వచ్చే గ్రాడ్యుయేట్‌లకు ఇచ్చే ప్యాకేజీలకన్నా తక్కువ. మరోవైపు, 123 కంపెనీలు 558 ఆఫర్‌లు, సంవత్సరానికి రూ. 20 లక్షలకు మించిన స్థూల పరిహారం ప్యాకేజీలతో వచ్చాయి. 230 ఆఫర్‌లు సంవత్సరానికి రూ. 16.75 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఉన్నాయి. మరోవైపు సగటు వేతనం గత సంవత్సరం రూ. 21.8 లక్షల నుండి రూ. 23.5 లక్షలకు పెరగడం గమనార్హం. ఇది సుమారు 7.7% వృద్ధిని సూచిస్తుంది.

Details

రెండో దశలో బాంబే ప్లేస్ మెంట్స్ తగ్గుదల

ఈ ఏడాది IIT బాంబేలో రిక్రూట్‌మెంట్ చేస్తున్న కంపెనీల సంఖ్యలో 12% వృద్ధి కనిపించింది. IIT బాంబేలో ప్లేస్‌మెంట్ సీజన్ రెండవ దశ నెమ్మదిగా ప్రారంభమైంది. కానీ ఏప్రిల్‌ తర్వాత ఊపందుకుంది. ఈ కాలంలో దాదాపు 300 ఉద్యోగ ఆఫర్‌లొచ్చాయి. సుమారు 75% మంది విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనగా, మరో 15% మంది తమ స్వంత ప్రయత్నాలతో ఉద్యోగాలను పొందారు. ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 543 కంపెనీలు ప్లేస్‌మెంట్ కోసం రిజిస్టర్ చేసుకోగా, 388 కంపెనీలు మాత్రమే విద్యార్థులకు ఆఫర్‌లు ఇచ్చాయి.

Details

ప్లేస్ మెంట్లలో కీలక పాత్ర పోషించిన ఇంజినీరింగ్, టెక్నాలజీ

ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగం ఈ ఏడాది ప్లేస్‌మెంట్లలో కీలక పాత్ర పోషించింది. 106 కోర్ ఇంజనీరింగ్ కంపెనీలలో 430 మంది విద్యార్థులు ఎంట్రీ-లెవల్ స్థానాలకు ఎంపికయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. అయితే కన్సల్టింగ్ ఆఫర్‌లు తగ్గాయి. ఈ సంవత్సరం ట్రేడింగ్, బ్యాంకింగ్ మరియు ఫిన్‌టెక్ కంపెనీలు కూడా గణనీయమైన రిక్రూటర్‌లుగా నిలిచాయి. ఫైనాన్స్ సెక్టార్‌లో 33 ఆర్థిక సేవా సంస్థల నుండి 113 ఆఫర్‌లు వచ్చాయి.