Page Loader
lic bima sakhi yojana: మహిళలకి గుడ్​న్యూస్​- నెలకు రూ. 7,000 సబ్సిడీతో ఎల్‌ఐసి కొత్త పథకం.. ప్రారంభించిన మోదీ 
మహిళలకి గుడ్​న్యూస్​- నెలకు రూ. 7,000 సబ్సిడీతో ఎల్‌ఐసి కొత్త పథకం.. ప్రారంభించిన మోదీ

lic bima sakhi yojana: మహిళలకి గుడ్​న్యూస్​- నెలకు రూ. 7,000 సబ్సిడీతో ఎల్‌ఐసి కొత్త పథకం.. ప్రారంభించిన మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2024
06:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పదో తరగతి చదివిన మహిళలు కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ పథకానికి పేరు 'బీమా సఖి యోజన'. హరియాణాలోని పానీపత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా విద్యార్హత, వయోపరిమితి, సాలరీ వంటి ముఖ్య సమాచారం గురించి తెలుసుకోవచ్చు.

వివరాలు 

పది చదివితే చాలు! 

ఎల్‌ఐసీ 'బీమా సఖి యోజన' ద్వారా రాబోయే మూడేళ్లలో 2 లక్షల మంది మహిళా బీమా ఏజెంట్లను నియమించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. పదో తరగతి ఉత్తీర్ణులు అయిన 18-70 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబనను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, బీమా రంగంపై అవగాహన పెంపొందించడం ఈ పథకానికి ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి.

వివరాలు 

మూడేళ్లు శిక్షణ, స్టైఫండ్ 

బీమా సఖులుగా ఎంపికైన మహిళలకు బీమా రంగంలో తగిన శిక్షణ అందించి, ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమిస్తారు. ఈ సమయంలో వారికీ నెలవారీ స్టైఫండ్ అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తారు. మొదటి ఏడాది నెలకు ₹7,000, రెండో ఏడాది ₹6,000, మూడో ఏడాది ₹5,000 స్టైఫండ్‌గా అందిస్తారు. శిక్షణ అనంతరం మహిళలు బీమా రంగంలో మంచి స్థాయి ఉద్యోగాలకు ఎదగవచ్చు. గ్రాడ్యుయేట్ మహిళలకు డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఎదగడానికి కూడా అవకాశాలు ఉంటాయి.

వివరాలు 

ప్రధాని వ్యాఖ్యలు

'బీమా సఖి యోజన' ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ హరియాణాలో డబుల్ ఇంజిన్ సర్కార్ వేగవంతంగా పనిచేస్తోందని చెప్పారు. ఈ పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించి, బీమా సేవలను అందరికీ చేరవేస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హరియాణాలో ఇప్పటికే 1.15 కోట్ల మహిళలు లఖ్ పతి దీదీలుగా ఎదిగారని, ఈ సంఖ్యను 3 కోట్లకు చేరవేయడమే తమ లక్ష్యమని వివరించారు.

వివరాలు 

బీమా సఖుల పథకం

ఈ పథకం ద్వారా మహిళలు తమ ఆర్థిక స్థాయిని మెరుగుపరుచుకోవడంతోపాటు, బీమా రంగంలో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు పొందవచ్చు. పదో తరగతి విద్యార్హత కలిగిన 18-70 ఏళ్ల మధ్య వయసు గల మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.