
Punjab National Bank: ఆవిష్కరణలకి మద్దతుగా తొలి స్టార్టప్ బ్రాంచ్‌ను ప్రారంభించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)దిల్లీలో తన మొదటి స్టార్టప్-సెంట్రిక్ బ్రాంచ్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక బ్రాంచ్ ద్వారా స్టార్టప్ ఇండియాతో సహకరించి,కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, ఆవిష్కరణలను మద్దతు ఇవ్వడం,అలాగే బ్యాంకింగ్ సేవల ద్వారా స్టార్టప్‌లను సాయపడటం ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. బ్రాంచ్ ప్రారంభోత్సవంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్,PNB ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర పాల్గొన్నారు. PNB,STPI మధ్య ఒప్పందం కూడా కుదిరింది, దీని ద్వారా అర్హత ఉన్న స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు అందించే చర్యలు చేపడతారు. ఒప్పంద పత్రంపై PNB జనరల్ మేనేజర్ సుధీర్ దలాల్ మరియు STPI డైరెక్టర్ సుబోధ్ సచాన్ సంతకం చేశారు.
వివరాలు
దేశ వ్యాప్తంగా వ్యాపార అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో బ్యాంకు కట్టుబడి ఉంది: సీఈఓ అశోక్ చంద్ర
ఈ భాగస్వామ్యం ద్వారా, STPI తన ఇన్‌క్యుబేషన్ పొందిన లేదా అభివృద్ధి చెందిన స్టార్టప్‌ల జాబితాను PNBకి అందజేయనుంది. అదే విధంగా, PNB ఆర్థిక పథకాలు, బ్యాంకింగ్ సేవలను ఈ స్టార్టప్‌లకు అందించడంలో ముఖ్య వనరుగా పని చేయనుంది. ఈ సందర్భంలో, PNB సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా వ్యాపార అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో బ్యాంకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక బ్రాంచ్ స్టార్టప్‌ల కోసం సమగ్ర, వన్-స్టాప్ బ్యాంకింగ్ పరిష్కారాలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.