Primary Market Schedule: రూ. 11,000 కోట్ల విలువైన 9 IPOలు, 3 లిస్టింగ్‌లు.. వచ్చేవారం మార్కెట్‌లో పలు ఐపీఓలు
ఐపీఓ (IPO)ల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. మెయిన్‌బోర్డ్ ,ఎస్‌ఎంఈ విభాగంలో ఐపీఓలు రానున్నాయి. రూ.10,985 కోట్లను సమీకరించేందుకు తొమ్మిది కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. హ్యుందాయ్ ఐపీఓతో సహా మూడు కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.
వారీ ఎనర్జీస్
సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ (Waaree Energies IPO) మార్కెట్ నుంచి రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు రానుంది. అక్టోబర్ 21న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై 23న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ 18న బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ.1,427 - రూ.1,503గా కంపెనీ నిర్ణయించింది. 9 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో భాగంగా రూ.3,600 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తున్నారు. రూ.721.44 కోట్ల విలువైన మరో 48 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు.
దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్
మెయిన్ బోర్డ్ నుంచి మరో ఐపీఓ రానుంది. దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్. రూ.260 కోట్లు సమీకరించనుంది. అక్టోబర్ 21న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై 23న ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.192 - రూ.203గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో రూ.217.21 కోట్ల విలువైన తాజా షేర్లను, రూ.42.83 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జారీ చేస్తారు.
గోదావరి బయో ఫైనరీస్
ఇథనాల్ రసాయనాల తయారీ సంస్థ గోదావరి బయో ఫైనరీస్ రూ.555 కోట్ల ఐపీఓ అక్టోబర్ 23న ప్రారంభం కానుంది. ధరల శ్రేణి రూ.334 - 352గా కంపెనీ నిర్ణయించింది. అక్టోబర్ 25న సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది. ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రా ప్రముఖ వ్యాపార సంస్థ షాపూర్జీ పాలోంజీ గ్రూప్‌కు చెందిన నిర్మాణ,ఇంజినీరింగ్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Afcons Infra IPO) ఐపీఓ అక్టోబర్ 25న ప్రారంభమై 29న బిడ్డింగ్ ముగియనుంది. రూ.5,430 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో రానుంది. ధరల శ్రేణి ఇంకా ప్రకటించలేదు.
లిస్టింగ్‌లు ఇవీ
గత వారం సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న హ్యుందాయ్ ఐపీఓ లిస్టింగ్‌పైనే అందరి దృష్టి ఉంది. వీటి షేర్లు అక్టోబర్ 22న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇక ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో లక్ష్య పవర్‌టెక్ అక్టోబర్ 23న, ఫ్రెషరా ఆగ్రో ఎక్స్‌పోర్ట్ అక్టోబర్ 24న లిస్ట్ కానున్నాయి.