Ratan Tata: రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్ల నజరానా ?.. క్లారిటీ ఇచ్చిన రతన్ టాటా!
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ. 10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అదే విధంగా క్రికెటర్లకు రివార్డులు ఇవ్వనున్నట్లు కూడా వార్తలు పుట్టుకొచ్చాయి.
ఈ వార్తలపై రతన్ టాటా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తాను అంతర్జాతీయ మండలికి కానీ ఎటువంటి ప్లేయర్ కు కానీ రివార్డు అంశాన్ని ప్రకటించలేదని, క్రికెట్ గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని రతన్ టాటా పేర్కొన్నారు.
వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు, వీడియోలను నమ్మవద్దు అని, ఏదైనా ఉంటే తానే అధికారంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆయన వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రతన్ టాటా పోస్టు
I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players.
— Ratan N. Tata (@RNTata2000) October 30, 2023
I have no connection to cricket whatsoever
Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official…