Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీకి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
32 ఏళ్ల తమ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గౌతమ్ భార్య నవాజ్ మోదీ సంచనల ఆరోపణలు చేసింది.
తనను సింఘానియా శారీరకంగా హింసించాడని, ఆ సయమంలో అంబానీలు వచ్చి కాపాడారంటూ నేషనల్ మీడియాకు వివరించింది.
ముఖ్యంగా తనను దీపావళీ పార్టీకి కూడా అనుమతించలేదని పేర్కొంది.
మొదటగా సెప్టెంబర్ 10న తనపై, తమ మైనర్ కుమార్తెపై గౌతమ్ తీవ్రంగా దాడి చేశారని, 15 నిమిషాలు పాటు విచక్షణా రహితంగా హింసించాడని వెల్లడించింది.
Details
ఆరోపణలను ఖండించిన గౌతమ్ సింఘానియా
దాడి సమయంలో తమ ఇద్దరు పిల్లలు, వారి స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని, తమపై గౌతమ్ దాడి చేసిన తర్వాత ఆక్కడి నుంచి వెళ్లిపోయాడని నవాజ్ మోదీ అన్నారు.
ఆయన గన్ లేదా వేరే ఆయుధాల కోసం అక్కడి నుంచి వెళ్లాడని అనిపించిందని, వెంటనే తాను తన కుమార్తెను ఒక గదిలోకి వెళ్లి లాక్ చేశానని చెప్పారు.
రెండుసార్లు హెర్నియా సర్జరీలు జరిగాయని తెలిసినా గౌతమ్ తనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో నీతూ అంబానీ, అనంత్ అంబానీ రంగంలోకి దిగి పోలీసులు తమ వద్దకు వచ్చేలా చేశారన్నారు.
ఈ ఆరోపణలను గౌతమ్ సింఘానియా నిరాకరించారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని, తమ గోప్యతకు గౌరవం ఇవ్వండి అంటూ సింఘానియా కోరారు.