Page Loader
RBI governor deepfake:సోషల్ మీడియాలో ఆర్‌బీఐ గవర్నర్‌'డీప్‌ఫేక్' వీడియోలు.. ప్రజలకు అలర్ట్‌  
సోషల్ మీడియాలో ఆర్‌బీఐ గవర్నర్‌'డీప్‌ఫేక్' వీడియోలు.. ప్రజలకు అలర్ట్‌

RBI governor deepfake:సోషల్ మీడియాలో ఆర్‌బీఐ గవర్నర్‌'డీప్‌ఫేక్' వీడియోలు.. ప్రజలకు అలర్ట్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

డీప్‌ఫేక్‌ సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం కలకలం రేపుతోంది. ఈ వీడియోలు పెట్టుబడుల సలహాలను అందిస్తున్నట్లుగా చూపించడంతో ఆర్‌బీఐ ఈ వ్యవహారంపై స్పందించి ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. శక్తికాంత దాస్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఈ డీప్‌ఫేక్‌ వీడియోలు కొన్ని పెట్టుబడి పథకాలను ప్రోత్సహిస్తున్నట్లుగా చెబుతున్నాయి. దీనిపై ఆర్‌బీఐ ప్రకటన చేస్తూ,ఈ వీడియోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అవి పూర్తిగా కృత్రిమంగా సృష్టించబడిన ఫేక్ వీడియోలని స్పష్టం చేసింది. అలాగే, ఆర్‌బీఐ పెట్టుబడుల గురించి ఎలాంటి సలహాలు ఇవ్వదని, ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది.

వివరాలు 

మదుపర్లకు NSE హెచ్చరికలు జారీ

ఇలాంటి డీప్‌ఫేక్‌ వీడియోలు ముందు కూడా ఇతర సంస్థలను టార్గెట్ చేశాయి. గతంలో నేషనల్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE) ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్‌ పేరుతో డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్ కావడంతో NSE కూడా మదుపర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరహా వీడియోలు పూర్తిగా ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించబడుతున్నాయని, వాటి వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.