Loading...
RBI: బ్యాంకుల మూలధన అవసరాలపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమలు
బ్యాంకుల మూలధన అవసరాలపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమలు

RBI: బ్యాంకుల మూలధన అవసరాలపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్‌ రిస్క్‌ను ఎదుర్కొనేందుకు బ్యాంకులు పాటించాల్సిన కనీస మూలధన అవసరాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం తక్కువ మూలధన అవసరాలు కల్పించుకోవడానికి వీలుగా ట్రేడింగ్‌ బుక్‌, బ్యాంకింగ్‌ బుక్‌ మధ్య సాధనాలను వర్గీకరించే అవకాశం బ్యాంకులకు ఉండదు. నియంత్రణ మధ్యవర్తిత్వాన్ని అరికట్టే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చింది. సవరించిన బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణంగా ఆర్‌ బి ఐ మార్కెట్‌ రిస్క్‌ మార్గదర్శకాలను తాజా ఆదేశాలతో మార్చింది. అదే సమయంలో నిబంధనల్లో అవసరమైన సరళత, సౌలభ్యాన్ని తీసుకురావడంతో పాటు వాటిని బ్యాంకులు సులభంగా అమలు చేసేందుకు వీలు కల్పించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ఆర్‌బీఐ తెలిపింది.

వివరాలు 

అన్ని వాణిజ్య బ్యాంకులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి

కొత్త నిబంధనల ప్రకారం మార్కెట్‌ రిస్క్‌కు సంబంధించిన కనీస మూలధన అవసరాలను బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది.

తక్కువ మూలధనాన్ని కేటాయించే అవకాశం కోసం ట్రేడింగ్‌ బుక్‌, బ్యాంకింగ్‌ బుక్‌లోని సాధనాలను తమకు అనుకూలంగా వర్గీకరించేందుకు మాత్రం అనుమతి ఉండదు.

తద్వారా నిబంధనలను అనుసరించే విధానంలో పారదర్శకత పెంచేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.

ఈ ఆదేశాలు అన్ని వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. అయితే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకులు, లోకల్‌ ఏరియా బ్యాంకులకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

వివరాలు 

తాజా ఆదేశాలు 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

బ్యాంకులకు కొత్త నిబంధనలను అమలు చేసేందుకు తగినంత సమయం లభించేలా ఆర్‌బీఐ గడువు కూడా ఇచ్చింది.

తాజా ఆదేశాలు 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.

దీంతో సంబంధిత బ్యాంకులు కొత్త మూలధన అవసరాలు, మార్కెట్‌ రిస్క్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ వ్యవస్థలను సిద్ధం చేసుకునేందుకు అవకాశం లభించనుంది.

ADVERTISEMENT