RBI: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథం
ఈ వార్తాకథనం ఏంటి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తన కీలక వడ్డీ రేట్లను ఎటువంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం రెపో రేటు 5.25శాతంలోనే కొనసాగుతుందని చెప్పారు.ఈ సమీక్ష RBI నిర్వహించిన మొదటి ద్వైమాసిక సమీక్ష,కేంద్రం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత జరిగింది. గతేడాది RBIవడ్డీ రేట్లను పలు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరి,ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25బేసిస్ పాయింట్లు తగ్గించగా,జూన్‌లో RBI ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్లు కోత వేసింది. ఆ తర్వాత డిసెంబరులో మరో పావుశాతం తగ్గింపును చేసింది. దీంతో గత సంవత్సరం మొత్తం రెపో రేటు 1.25శాతం వరకు దిగింది.
వివరాలు
RBI ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది; ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల పనితీరు మెరుగుపడటం, అసంఘటిత రంగంలో స్థిరమైన వృద్ధి, తయారీ రంగానికి మద్దతు అందిస్తాయి. ఇటీవల చర్చించిన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం,త్వరలో జరగనున్న భారత్-అమెరికా ట్రేడ్ డీల్ దేశీయ వృద్ధిని మరింత బలోపేతం చేస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి అంచనా వేయబడింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో, తొలి త్రైమాసికంలో 6.9 శాతం,రెండో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి సాధ్యమని RBI అంచనా వేసింది.
వివరాలు
RBI ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉండవచ్చని,2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 4 శాతం,రెండో త్రైమాసికంలో 4.2 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావచ్చని అంచనా. జనవరి చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 723.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వ్యవస్థలో రోజువారీ సగటున 75,000 కోట్లు రూపాయల ద్రవ్య లభ్యత ఉంది.