NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం
    తదుపరి వార్తా కథనం
    RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం
    వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం

    RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.

    ఆర్‌ బి ఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం ప్రకటించారు.

    రెపో రేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

    2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి.

    వివరాలు 

    శక్తికాంత దాస్‌ ప్రసంగంలో కీలక అంశాలివే..

    2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 7.2శాతంగా అంచనా వేయబడింది.రెండో త్రైమాసికంలో 7శాతం, మూడు,నాలుగో త్రైమాసికంలో 7.4శాతంగా ఉండే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన తొలి క్వార్టర్‌లో 7.3శాతంగా వృద్ధి రేటు అంచనా వేయబడింది.

    ఈ ఏడాది చివరికి మెరుగైన వర్షపాతం,సరిపడా నిల్వలతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా పెరగవచ్చని అంచనా వేయబడింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉండే అవకాశం ఉంది.

    తయారీ ఖర్చులు తగ్గడం,ప్రభుత్వ విధానాలు,దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌ వంటి కారణాల వల్ల తయారీ రంగం వృద్ధి చెందుతోంది.ఆర్థిక రంగం స్థిరంగా ఉంది.బ్యాంకుల కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి.

    యూపీఐలైట్‌ వాలెట్‌ పరిమితిని రూ.2000 నుంచి రూ.5,000కు పెంచడం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    శక్తికాంత దాస్‌

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    ఆర్ బి ఐ

    Zomato: ఆన్‌లైన్ చెల్లింపు అగ్రిగేటర్‌గా జొమాటోకి ఆర్‌బీఐ అనుమతి  జొమాటో
    Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు  పేటియం
    Paytm: ఆర్‌బీఐ ఆంక్షలపై జోక్యం చేసుకోలేం: పేటీఎం‌కు కేంద్రం సూచన  పేటియం
    RBI: ఆర్ బి ఐ కీలక నిర్ణయం.. యథాతథంగా RBI రెపో రేటు . బిజినెస్

    శక్తికాంత దాస్‌

    RBI Monetary Policy: భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఉపశమనం.. ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం ఆర్ బి ఐ
    Repo Rate: రెపోరేటు యథాతథం.. 6.5%గానే కొనసాగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం ఆర్ బి ఐ
    RBI: కొన్ని గంటల్లో చెక్ క్లియర్ అవుతుంది! ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటన బిజినెస్
    #NewsBytesExplainer: ఇప్పుడు హోమ్ లోన్ టాప్ అప్ చేయడం కష్టం.. RBI నుండి అప్‌డేట్ ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025