Page Loader
RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ 
RBI : 6నెలలు దాటింది.. రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ

RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 01, 2023
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో కరెన్సీ నోట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రూ.2 వేల నోట్లను ఉపసంహరించి ఆరు నెలలు దాటిందని గుర్తు చేసింది. అయినప్పటికీ రూ.9700 కోట్ల విలువైన నోట్లు మాత్రం వెనక్కి రాలేదని వెల్లడించింది. చలామణీలో ఉన్న 97.26 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రకటించేసింది. కానీ రూ.9,760 కోట్లు విలువైన నోట్లు ఇంకా చలామణిలోనే ఉన్నాయని పేర్కొంది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ మరోసారి స్పష్టం చేసింది. రూ.2 వేల విలువైన నోటును ఈ ఏడాదిలోని మే 19న ఆర్‌ బి ఐ ఉపసంహరించుకుంది.

DETAILS

ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చు : రిజర్వ్ బ్యాంక్

అయితే ఆర్‌బీఐ నిర్ణయం వెలువడే నాటికే రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉండటం కొసమెరుపు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి, డిపాజిట్‌కు తొలుత సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చి అక్టోబర్‌7 వరకు గడువును పొడిగించింది. ఈ మేరకు నవంబర్‌ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయన్న ఆర్​బీఐ ,రూ.2 వేల నోటు ఇంకా చెల్లుబాటు అవుతుందని, ప్రాంతీయ కార్యాలయాల వద్ద ఎక్స్ఛేంజీ/ డిపాజిట్‌ చేసుకోవచ్చని సూచించింది.నోట్లను పోస్టల్‌ శాఖ ద్వారానూ పోస్ట్ చేసుకోవచ్చని వివరించింది. Regional Offices : హైదరాబాద్‌, కాన్పూర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, బేల్‌పుర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగడ్‌, చెన్నై, గువాహటి, జైపూర్‌, జమ్ము, దిల్లీ, పట్నా, తిరువనంతపురం.