Page Loader
RBI : ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్‌బీఐ సమగ్ర సూచనలు
ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్‌బీఐ సమగ్ర సూచనలు

RBI : ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్‌బీఐ సమగ్ర సూచనలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 08, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్‌ బి ఐ (Rserve Bank Of India) సమగ్ర సూచనలు చేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు సమాచార సాంకేతిక (ఐటీ) గవర్నెన్స్, నియంత్రణలకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాన్ని ఆర్‌బీఐ మంగళవారం విడుదల చేసింది. ఐటీ గవర్నెన్స్‌లో కీలకమైన అంశాల్లో వ్యూహాత్మక అమరిక, రిస్క్ మేనేజ్‌మెంట్, రిసోర్స్ మేనేజ్‌మెంట్, పనితీరు నిర్వహణ, వ్యాపార కొనసాగింపు/విపత్తు రికవరీ మేనేజ్‌మెంట్ ఉంటాయి. దీనికి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్, రిస్క్, కంట్రోల్స్ అండ్ అష్యూరెన్స్ ప్రాక్టీసెస్) 2023 ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.

details

 సిస్టమ్ లాగిన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్న ఆర్‌బీఐ

నియంత్రిత సంస్థలు మొత్తం ఐటీ కార్యాచరణను నిర్ధారించేందుకు సమాచార వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి బలమైన IT సర్వీస్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని స్పష్టం చేసింది. డేటా మైగ్రేషన్ కోసం క్రమబద్ధమైన ప్రక్రియగా డాక్యుమెంట్ చేయబడిన డేటా మైగ్రేషన్ పాలసీని కలిగి ఉండాలని చెప్పింది.ఈ క్రమంలోనే డేటా సమగ్రత, సంపూర్ణతతో పాటు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఈ పాలసీ ఇతరత్రా, వ్యాపార వినియోగదారులు,అప్లికేషన్ యజమానుల నుంచి వలసలు, ఆడిట్ ట్రయల్స్ నిర్వహణ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను కలిగి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. క్లిష్టమైన లేదా సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయగల లేదా ప్రభావితం చేయగల ప్రతి IT అప్లికేషన్,అవసరమైన ఆడిట్ తో పాటు సిస్టమ్ లాగిన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నొక్కి చెప్పింది.