LOADING...
RBI: పేటీఎంకు ఆర్‌బీఐ భారీ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు
పేటీఎంకు ఆర్‌బీఐ భారీ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

RBI: పేటీఎంకు ఆర్‌బీఐ భారీ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
08:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఇచ్చిన లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇకపై బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. డిపాజిటర్లు, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా బ్యాంక్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో విఫలమైందని కూడా తెలిపింది.

వివరాలు

డిపాజిట్లు స్వీకరించడంపై కూడా పరిమితులు

బ్యాంకింగ్ సేవల మూసివేతపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని ఆర్‌బీఐ వెల్లడించింది. అదే సమయంలో డిపాజిటర్లకు చెల్లింపులు చేయడానికి అవసరమైన తగిన నగదు నిల్వలు పేటీఎం వద్ద ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది. 2022 మార్చి 11న కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2024లో డిపాజిట్లు స్వీకరించడంపై కూడా పరిమితులు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిన వ్యవహారాల కారణంగా చివరికి పూర్తిగా లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Advertisement