RBI: ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి.. మార్చి 31పై ఆర్ బిఐ కీలక ఆదేశాలు
ఈ ఏడాది మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బి ఐ)ప్రకటన విడుదల చేసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం రావడంతో ఆర్ బి ఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్ బి ఐ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వం,ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి. సాధారణంగా మార్చి 31న ఫైనాన్సియల్ ఇయర్ ముగిసిన తరువాత ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తాయి. బ్యాంకుల దస్త్రాల ఆడిట్ కోసం ఏప్రిల్ 1న లావాదేవీలు నిర్వహిస్తారు. ప్రతి నెల అన్ని ఆదివారాలు,2,4 శనివారాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.