LOADING...
RBI updates: ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్.. యూపీఐ, కార్డ్ పేమెంట్స్‌లో కీలక మార్పులు
ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్.. యూపీఐ, కార్డ్ పేమెంట్స్‌లో కీలక మార్పులు

RBI updates: ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్.. యూపీఐ, కార్డ్ పేమెంట్స్‌లో కీలక మార్పులు

వ్రాసిన వారు Moogati Shabari
May 01, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆటో-డెబిట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. 'డిజిటల్ పేమెంట్స్ — ఈ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్, 2026' పేరుతో విడుదల చేసిన ఈ నిబంధనలు, ఆటోమేటిక్‌గా జరిగే చెల్లింపుల విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. ఆర్బీఐ తెలిపిన ప్రకారం, ఈ మార్పులు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని పేర్కొంది. కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (వాలెట్లు), యూపీఐ ద్వారా జరిగే రికరింగ్ ట్రాన్సాక్షన్లు, దేశీయ, అంతర్జాతీయ చెల్లింపులపై ఇవి వెంటనే అమల్లోకి వస్తాయి.

వివరాలు

ఇక ఓటీపీ అవసరం లేదు..

ఈ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యమైన మార్పులు చూస్తే, రూ.15,000 వరకు జరిగే రికరింగ్ ట్రాన్సాక్షన్లకు ఇకపై ప్రతి సారి OTP అవసరం ఉండదు. అయితే, ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే వినియోగదారులు ఒకసారి మాత్రమే అదనపు ధృవీకరణ (AFA)తో ఈ-మాండేట్ నమోదు చేసుకోవాలి. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత, రూ.15,000 వరకు ఉన్న చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఈ సౌకర్యం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, SIPలు, నెట్‌ఫ్లిక్స్, టాటా స్కై వంటి సబ్‌స్క్రిప్షన్లు, EMIలు, నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, ఇంటర్నెట్ చార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటి పలు చెల్లింపులకు వర్తిస్తుంది.

వివరాలు

ఎక్కువ మొత్తాలు డెబిట్ అవకుండా నియంత్రణ

ఒకసారి ఈ-మాండేట్ నమోదు చేసుకున్న తర్వాత, వినియోగదారులు ఎప్పుడైనా తమ ఆటో డెబిట్ సూచనలను మార్చుకోవచ్చు, తాత్కాలికంగా నిలిపివేయచ్చు లేదా పూర్తిగా రద్దు చేసుకోవచ్చు. ఈ మార్పులకు కూడా AFA ద్వారా ధృవీకరణ అవసరం ఉంటుంది. అలాగే, వేరియబుల్ పేమెంట్లకు వినియోగదారులు గరిష్ట పరిమితిని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అనుకోకుండా ఎక్కువ మొత్తాలు డెబిట్ అవకుండా నియంత్రణ ఉంటుంది. బ్యాంకులు లేదా పేమెంట్ ప్రొవైడర్లు ఈ-మాండేట్ చెల్లుబాటు గడువును స్పష్టంగా పేర్కొనాలి. నమోదు సమయంలో ఈ వివరాలను కస్టమర్లకు తప్పనిసరిగా తెలియజేయాలి.

Advertisement

వివరాలు

వాటికి అదనపు ఛార్జీలు లేవు..

ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లుల విషయంలో పరిమితి రూ.1 లక్ష వరకు పెంచారు. ఈ చెల్లింపులు ఈ-మాండేట్ కింద నమోదు అయి ఉంటే, AFA లేకుండానే ప్రాసెస్ అవుతాయి. మరోవైపు, ఈ-మాండేట్ సౌకర్యాన్ని వినియోగించుకునే కస్టమర్లపై బ్యాంకులు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే, ప్రతి ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్‌కు కనీసం 24 గంటల ముందే కస్టమర్లకు అలర్ట్ పంపాలని ఆదేశించింది. ఆ అలర్ట్‌లో డెబిట్ అయ్యే మొత్తం, తేదీ, మర్చంట్ పేరు వంటి వివరాలు ఉండాలి. ఈ అలర్ట్ ద్వారా వినియోగదారులు ఏదైనా తప్పు ట్రాన్సాక్షన్ లేదా మోసపూరిత చెల్లింపు అనిపిస్తే ముందుగానే దానిని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement