New Interest Rates: అక్టోబర్ 1 నుంచి RBL బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు.. లక్షలోపు బ్యాలెన్స్‌కు ప్రభావం
ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న ప్రముఖ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL) తమ కస్టమర్లకు షాకిచ్చింది. సెప్టెంబర్ 2024లో బ్యాంకు తన పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త రేట్లు ప్రకారం 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీని 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తీసుకొస్తున్నారు. ఆర్‌బీఎల్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం అనూహ్యంగా మారింది.
సేవింగ్స్ ఖాతాలపై కొత్త వడ్డీ రేట్లు
రూ.1 లక్ష కంటే ఎక్కువ నగదు ఉన్న ఖాతాలకు వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా కొనసాగిస్తూ, లక్ష లోపు బ్యాలెన్స్ కలిగి ఉన్న ఖాతాదారులకు మాత్రమే ఈ తగ్గింపును వర్తింపజేస్తున్నారు. రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్ - 3.50% వడ్డీ 2. రూ.1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు - 5.50% వడ్డీ 3. రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు - 6% వడ్డీ 4. రూ. 25 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు - 7.50% వడ్డీ 5. రూ. 3 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల వరకు - 6.50% వడ్డీ
కొత్త వడ్డీ రేట్లు
6. రూ. 7.5 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు - 6.25% వడ్డీ 7. రూ. 50 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు - 5.25% వడ్డీ 8. రూ. 75 కోట్ల నుంచి రూ. 125 కోట్ల వరకు - 7.75% వడ్డీ 9. రూ. 125 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు - 6% వడ్డీ 10. రూ. 200 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు - 4% వడ్డీ 11. రూ. 400 కోట్లకు మించిన బ్యాలెన్స్ - 6.75% వడ్డీ