తదుపరి వార్తా కథనం

IPO: అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 5 బిలియన్ డాలర్ల ఐపీఓలు ప్రవేశం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 01, 2025
10:16 am
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల (IPO) సందడి ఊచకోత చూపుతోంది. పలు కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ అక్టోబర్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా 5 బిలియన్ డాలర్లను సమీకరించేందుకు IPOలు ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా టాటా క్యాపిటల్ లిమిటెడ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ వంటి బిగ్ ఐపీఓలు వచ్చే వారంలో సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వస్తాయి.
Details
స్టాక్ మార్కెట్‌పై మదుపర్లలో విశ్వాసం
విదేశీ మార్కెట్ల పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది. అమెరికా టారిఫ్‌లు, ఆదాయాలు తగ్గడం వంటి కారణాల వల్ల ఇతర ఆసియా మార్కెట్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ భారీ ఐపీఓలు భారత స్టాక్ మార్కెట్‌పై మదుపర్లలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. అంతేకాకుండా విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు ఉన్నప్పటికీ, దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వెల్లువెత్తడం ఈ IPO సందడికి తోడ్పడుతోంది.