LOADING...
Gold price: రికార్డు క్రియేట్ చేసిన బంగారం.. రూ.1.25 లక్షల మార్కును చేరుకున్న పసిడి!
రికార్డు క్రియేట్ చేసిన బంగారం.. రూ.1.25 లక్షల మార్కును చేరుకున్న పసిడి!

Gold price: రికార్డు క్రియేట్ చేసిన బంగారం.. రూ.1.25 లక్షల మార్కును చేరుకున్న పసిడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల పసిడి ధర రూ.1 లక్ష దాటితేనే ఆశ్చర్యపోయిన ప్రజలు, ఇప్పుడు రూ.1.25 లక్షల మార్కు చేరుకోవడంతో షాక్‌కు గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఔన్సు తొలిసారిగా 4,000 డాలర్లను దాటింది. అమెరికా ఫెడరల్‌ గవర్నమెంట్‌ షట్‌డౌన్‌ భయం, ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చిత పరిస్థితులు బంగారంపై డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,25,780గా నమోదైంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,12,900గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.1.56 లక్షలు దాటింది.

Details

 ఏడాదిలో 50% పెరుగుదల 

అంతర్జాతీయ విపణిలో స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర 4,034 డాలర్ల వద్ద, వెండి ఔన్సు ధర 48.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌-రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.88.79గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు బంగారాన్ని మరింత ఆకర్షణీయ పెట్టుబడి సాధనంగా మార్చాయి. అంతర్జాతీయ వాణిజ్య టారిఫ్‌లు, జియోపాలిటికల్‌ టెన్షన్‌లు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు కారణంగా బంగారం ధరలు ఆకాశాని వెళ్లాయి. రెండు సంవత్సరాల క్రితం ఔన్సు బంగారం ధర 2,000 డాలర్లలోపే ఉండగా, ఇప్పుడు అది ఒకే క్యాలెండర్‌ సంవత్సరంలో దాదాపు 50 శాతం పెరగడం గమనార్హం.

Details

ఇంకా పెరిగే ఛాన్స్

ఈ ధరల పెరుగుదలతో సాధారణ వినియోగదారులు బంగారం కొనుగోళ్లలో వెనకడుగు వేస్తున్నారు. పండుగ సీజన్‌లో అమ్మకాలు తగ్గిపోవడంతో ఆభరణ వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిడి ధరలు ఇలా కొనసాగితే, భవిష్యత్తులో సాధారణ ప్రజలకు బంగారం అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.