
IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి 31 నుండి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి ముందు, రిలయన్స్ జియో క్రికెట్ ప్రేమికుల కోసం కొత్త టారిఫ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది.
IPL సీజన్ లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని జియో రోజుకు 3GB డేటా, 150 GB వరకు ప్రయోజనాలతో ప్రత్యేక డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.219, రూ.399, రూ.999 ధర ఉన్న ఈ మూడు టారిఫ్ ప్లాన్‌లు వరుసగా 14 రోజులు, 28 రోజులు, 84 రోజుల వాలిడిటీతో వస్తాయి.
అన్ని క్రికెట్ ప్లాన్‌లతో అపరిమిత True-5G డేటాతో, జియో వినియోగదారులు స్క్రీన్‌ల అంతటా 4K స్పష్టతతో అన్నీ కెమెరా యాంగిల్స్ ద్వారా ప్రత్యక్ష మ్యాచ్‌లను చూడచ్చని జియో ఒక ప్రకటనలో తెలిపింది.
జియో
ఈ ఆఫర్ మార్చి 24 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది
ఈ ఆఫర్ మార్చి 24 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త ప్లాన్‌ల గురించి జియో ప్రతినిధి మాట్లాడుతూ జియోలో, మా కస్టమర్‌లకు అత్యుత్తమ క్రీడా అనుభవాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం.
క్రికెట్ సీజన్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌లను పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి ఈ ప్రత్యేకమైన ప్లాన్‌లు, ఆఫర్‌లను రూపొందించామని అన్నారు.
క్రికెట్ కోసం జియో తన వినియోగదారులకు అందించే ఆఫర్స్ కు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన ప్రకటనలు రానున్నాయని ప్రతినిధి తెలిపారు.