LOADING...
వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో
రూ.100 పై ప్లాన్స్ పై ఉచిత జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్

వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 20, 2023
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. ఇది 2016లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి వినియోగదారులకు అనుకూలంగా ఉండే రీఛార్జి ప్లాన్స్ అమలుచేస్తూ వస్తుంది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఇంటర్నెట్ డేటాను అందించే ఆల్ ఇన్ వన్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం రూ. 75తో 23 రోజులకు, రూ. 91తో 28 రోజులకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 100MB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 50 SMS, జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ తో పాటు ఒక్కో ప్యాక్‌కి 200MB అదనపు డేటాను అందిస్తాయి. రూ.125తో 23 రోజులకు, రూ. 152తో 28 రోజులకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 500MB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు,300 SMS వస్తుంది.

జియో

రూ.100 పై రీఛార్జి ప్లాన్స్ పై ఉచిత జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది

28 రోజుల వ్యాలిడిటితో రూ.186 ప్లాన్ 1GB డేటా/రోజు, వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు అందిస్తుంది. వీటిలో ఉచిత జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. 28 రోజుల వ్యాలిడిటితో రూ.222 ప్లాన్ ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMS, 2GB డేటాను అందిస్తుంది.వినియోగదారులు JioTV, JioCinema, JioSecurity, JioCloudతో సహా జియో యాప్‌ల జాబితాకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. వార్షిక ప్యాక్ రూ. రూ. 895 336 రోజుల వ్యాలిడిటితో రూ. 895 ఈ ప్లాన్ లో ప్రతి 28 రోజులకు 2GB డేటా, 50 SMSలను పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.