60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
దేశంలో 5G సేవలు మొదలుపెట్టిన టెలికాం సంస్థలలో జియో ఒకటి, బ్రాడ్ బ్రాండ్ సర్వీసులను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ డివైజ్ తయారీ సంస్థ మిమోసా నెట్వర్క్ (Mimou)ను కొనుగోలు చేయనుంది. జియో లో భాగమైన ర్యాడీసీస్ కార్పొరేషన్, మిమోసా నెట్వర్క్ పేరెంట్ సంస్థ ఎయిర్ట్స్పెన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. వైఫై టెక్నాలజీకి సంబంధించిన మల్టీ పాయింట్ నెట్వర్కింగ్ పరికరాలను మిమోసా తయారు చేయనుంది. ఇప్పటికే 5G సేవలు మొదలుపెట్టిన సంస్థ ఈ ఏడాది చివరి నాటికి అన్నీ ప్రధాన నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో విస్తరిస్తుంది.
బ్రాడ్ బ్రాండ్ సేవలను కూడా విస్తరించాలని లక్ష్యంతో చైనా సంస్థతో ఒప్పందం
ఇక బ్రాడ్ బ్రాండ్ సేవలను కూడా విస్తరించాలని లక్ష్యంతో చైనాకు చెందిన టెలికాం ఉపకరణాలు తయారు చేసే హువాచే సంస్థతో డీల్ కుదుర్చుకుంది. భారత్ సహా వివిధ దేశాలు ఆ దేశ ఉపకరణాలను నిషేధించిన సమయంలో ఈ డీల్ కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎయిర్ట్పెన్ కంపెనీలో ఇప్పటికే జియోకు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ యూఎస్ఏలో వాటా ఉంది. 5G నెట్వర్క్ విస్తరణ ఉపకరణాల కోసం నోకియాతో ఇదివరకే జియో ఒప్పందం కుదుర్చుకుంది.