LOADING...
Kelvinator: రిలయన్స్‌ రిటైల్‌ చేతికి కెల్వినేటర్‌ బ్రాండ్‌ 
రిలయన్స్‌ రిటైల్‌ చేతికి కెల్వినేటర్‌ బ్రాండ్‌

Kelvinator: రిలయన్స్‌ రిటైల్‌ చేతికి కెల్వినేటర్‌ బ్రాండ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ వినియోగదారుల డ్యూరబుల్స్ బ్రాండ్ అయిన కెల్వినేటర్‌ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. అయితే ఈ కొనుగోలుకు ఎంత మొత్తం ఖర్చు చేశారన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దేశంలో వేగంగా పెరుగుతున్న ప్రీమియం హోమ్ అప్లయన్సెస్ మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడుతుందని రిలయన్స్ రిటైల్ తన ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు 

'ది కూలెస్ట్ వన్' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రత్యేక గుర్తింపు

ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేషన్ విభాగంలో కెల్వినేటర్ బ్రాండ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందినది. దేశీయ మార్కెట్‌లో 1970లు, 1980ల కాలంలో అత్యాధునిక సాంకేతికత, మెరుగైన పనితీరు, నాణ్యత కారణంగా 'ది కూలెస్ట్ వన్' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి ప్రముఖ బ్రాండ్ ఇప్పుడు విస్తృత రిటైల్ నెట్‌వర్క్ కలిగిన రిలయన్స్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఈ కొనుగోలుతో ప్రీమియం గృహోపకరణాల మార్కెట్‌లో తమ కంపెనీ మున్ముందు మరింత గణనీయమైన వృద్ధిని సాధించగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.