Page Loader
Reliance Retail : రిలయెన్స్‌ గూటికి చేరిన అర్వింద్‌ ఫ్యాషన్స్‌ అండ్ బ్యూటీ కేర్.. ఎంతకి కొన్నారో తెలుసా  
Reliance : రిలయెన్స్‌ గూటికి అర్వింద్‌ ఫ్యాషన్స్‌,బ్యూటీ కేర్.. ఎంతకి కొన్నారో తెలుసా

Reliance Retail : రిలయెన్స్‌ గూటికి చేరిన అర్వింద్‌ ఫ్యాషన్స్‌ అండ్ బ్యూటీ కేర్.. ఎంతకి కొన్నారో తెలుసా  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 03, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయెన్స్‌ రిటైల్‌, దేశీయ దిగ్గజ రిటైల్‌ సంస్థగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీ సంస్థ వ్యాపారపరంగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు అర్వింద్‌ ఫ్యాషన్స్‌ బ్యూటీ బిజినెస్‌ను హస్తగతం చేసుకుంది. రూ.216 కోట్లతో ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. రిలయెన్స్ గ్రూప్, తన రిటైల్‌ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. అర్వింద్‌ ఫ్యాషన్స్‌ కు చెందిన సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగాన్ని రిలయెన్స్‌ బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. మరోవైపు కొనుగోలు ప్రక్రియ పూర్తయితే తమ వాటాలన్నీ రిలయన్స్‌ రిటైల్‌ చేతుల్లోకి వెళ్లిపోతాయని అరవింద్ ఫ్యాషన్స్ పేర్కొంది. దీంతో రిలయెన్స్‌ రిటైల్‌ సంస్థకు అర్వింద్‌ బ్యూటీ బ్రాండ్స్‌ రిటైల్ అనుబంధ సంస్థగా మారుతుందని స్పష్టం చేసింది.

DETAILS

బకాయిలు పోను రూ.99.02 కోట్లు అందుతాయి : అరవింద్ ఫ్యాషన్స్

మరోవైపు, ఈ కోనుగోలు ప్రక్రియలో రుణ చెల్లింపులు కూడా భాగమేనని తెలిపిన అరవింద్ సంస్థ, బకాయిలు పోను తమకు రూ.99.02 కోట్లు అందుతాయని లెక్కలేసింది. 2022- 2023 ప్రకారం అర్వింద్‌ బ్యూటీ బ్రాండ్స్‌ రిటైల్' టర్నోవర్‌ రూ.336.70 కోట్లుగా రికార్డ్ అయ్యింది. అర్వింద్‌ ఫ్యాషన్స్‌ ఏకీకృత లాభాల్లో బ్యూటీ బ్రాండ్స్ వాటా 7.60 శాతం. అయితే టిరా బ్రాండ్‌ పేరిట రిలయెన్స్‌ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించింది. రిలయెన్స్‌ గ్రూప్‌ రిటైల్‌ వ్యాపారాలకు రిలయెన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (RRVL) హోల్డింగ్‌ కంపెనీగా కొనసాగుతోంది. భారతదేశంలో దేశీయ దిగ్గజ రిటైల్‌ సంస్థగా కొనసాగుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణలో HUL లాక్మే, నైకా, టాటా, LVMH సెఫోరా వంటి కంపెనీలతో పోటీ ఎదుర్కోనుంది.