Reliance Smart Stores: చిన్న పట్టణాల్లో స్మార్ట్ బజార్ స్టోర్లు.. వేగంగా విస్తరిస్తున్న రిలయెన్స్ రిటైల్ రంగం
ఈ వార్తాకథనం ఏంటి
రిలయెన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విేభాగం రిలయెన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని చిన్న పట్టణాలకు చేరుతోంది.
రిలయెన్స్ స్మార్ట్ బజార్ స్టోర్లను పెంచుతున్నట్లు సీఈఓ దామోదర్ మాల్ తెలిపారు. ఈ ఫీడర్ మార్కెట్‌లల్లో వినియోగదారుల వృద్ధిని మరింత ఆసక్తికరంగా చేస్తోందన్నారు. తాను చూసే రిలెన్స్ సూపర్‌మార్కెట్లు దేశంలోనే ఆధునిక దుకాణాలు అన్నారు.
ఇల్లు, వ్యక్తిగత సంరక్షణ, సాధారణ సరుకుల రంగాల్లో వేగవంతమైన వృద్ధి దిశగా రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోందన్నారు. ఈ కేటగిరీలో వేగంగా స్టోర్లు పెరుగుతున్నాయని మాల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని నోఖా, సికార్, తెలంగాణలోని ఆర్మూర్, బాన్సువాడతో పాటు ఒడిశాలోని రాయగడ, సిమ్లిగూడ వంటి చిన్న పట్టణాలు నిత్యావసరాలకు బలమైన డిమాండ్ ధోరణిని కనబరిచాయన్నారు.
DETAILS
ఎఫ్‌ఎంసిజీలు మార్కెట్‌తో వృద్ధికి అనుగుణంగా మారాల్సిందే : సీఈఓ మాల్
మరోవైపు డిజిటల్ యాప్‌లలో-విచక్షణతో కూడిన వ్యయంపై ఎలాంటి తగ్గుదల ప్రభావం చూపే సూచనలు లేవని తెలిపారు.
రిలయెన్స్ రిటైల్ స్మార్ట్ సూపర్‌స్టోర్, స్మార్ట్ పాయింట్, స్మార్ట్ బజార్, ఫ్రెష్ సిగ్నేచర్, ఫ్రెష్‌పిక్ మరియు 7-ఎలెవెన్ వంటి వివిధ స్టోర్ ఫార్మాట్‌లను నిర్వహిస్తోంది.
మార్కెట్ వృద్ధికి అనుగుణంగా ఎఫ్‌ఎంసీజీ(FMCG) కంపెనీలు మారాలన్న మాల్, ఆధునిక వాణిజ్యంలో మందగమనాన్ని ఎదుర్కొంటున్న ఎఫ్‌ఎంసిజీలు మార్కెట్‌తో వృద్ధికి అనుగుణంగా మారాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
స్థిరమైన ద్రవ్యోల్బణం, అసమాన వర్షాలు వంటి కారణాలతో గ్రామీణ మార్కెట్ డిమాండ్ బలహీనంగా ఉందన్నారు.
అయినప్పటికీ, రిలయెన్స్ రిటైల్ పరిధిలోని శీతల పానీయాలు,మిఠాయిలు, బిస్కెట్లు, సబ్బులు, డిష్‌వాషింగ్ బార్‌లు, లిక్విడ్‌లు,టాయిలెట్ సహా ఫ్లోర్ క్లీనర్‌లు,లాండ్రీ డిటర్జెంట్ వంటి FMCG ఉత్పత్తుల అమ్మకాలను నిర్వహిస్తోంది.