Page Loader
Jio Hotstar:హాట్‌స్టార్‌లో రిలయన్స్ జియో సినిమా విలీనం.. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లన్నీ అక్కడే!
హాట్‌స్టార్‌లో రిలయన్స్ జియో సినిమా విలీనం.. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లన్నీ అక్కడే!

Jio Hotstar:హాట్‌స్టార్‌లో రిలయన్స్ జియో సినిమా విలీనం.. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లన్నీ అక్కడే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్, డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించిన తాజా వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. విలీనానంతరం, కేవలం ఒకే ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ను ఉంచాలనే నిర్ణయాన్ని రిలయన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా, డిస్నీ+హాట్‌ స్టార్ (Disney+ Hotstar) లో జియో సినిమాను (Jio Cinema) విలీనం చేయనున్నారని సమాచారం ఉంది. రెండు సంస్థల సర్వీసులను కలిపి "జియో హాట్‌స్టార్" అనే పేరుతో కొనసాగించనున్నట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ఇకపై క్రికెట్ మ్యాచ్‌లు హాట్‌స్టార్‌లోనే చూడాల్సి ఉంటుందని కూడా తెలుస్తోంది.

వివరాలు 

ఈ విలీనంతో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్

వయకామ్ 18, స్టార్ ఇండియా విలీనం సమయంలో, సంస్థలు నిర్వహిస్తున్న రెండు ఓటీటీలను ఎలా నిర్వహించాలన్నది చర్చనీయాంశమైంది. మొదట హాట్‌స్టార్‌ను జియో సినిమాతో విలీనం చేస్తారనే వార్తలు వచ్చినా, కొంతకాలానికి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వేర్వేరు ఓటీటీలను ఉంచాలన్న ఆలోచన కూడా రిలయన్స్ వద్ద ఉన్నట్లు తెలిసింది. అయితే చివరికి జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి హాట్‌స్టార్‌కు ఉన్న మెరుగైన టెక్నాలజీ మద్దతు కారణంగా తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నా, డిస్నీ+హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఈ విలీనంతో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవతరించనుంది.