Page Loader
రిలయన్స్ వాటా అమ్మకం.. భారీగా పెట్టుబడి పెట్టనున్న ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ
భారీగా పెట్టుబడి పెట్టనున్న ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ

రిలయన్స్ వాటా అమ్మకం.. భారీగా పెట్టుబడి పెట్టనున్న ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 25, 2023
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఐపీఓకు వెళ్లనుంది. ఇందుకోసం తన వాటాలను విక్రయిస్తోంది. ఈ మేరకు 8 నుంచి 10 శాతం కంపెనీ షేర్లను అమ్మకానికి పెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో అదనంగా ఉన్న వాటాను విక్రయించేందుకు ఆ కంపెనీ సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలోనే షేర్లు విక్రయించేందుకు సమాయత్తమవుతోంది. వచ్చే 12 నుంచి 15 నెలల వ్యవధిలో వాటా విక్రయం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) భారీగా పెట్టుబడులను పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

DETAILS

రిలయన్స్ రిటైల్ లో రూ.8,278 కోట్ల భారీ పెట్టుబడులు

ఈ మేరకు రూ. 8,278 కోట్ల మెగా పెట్టుబడులను పెట్టేందుకు ఖతార్ సంస్థ అంగీకరించినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) కంపెనీ వెల్లడించింది. దీంతో RRVL కంపెనీ విలువ రూ.8.278 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీగా ఉన్నట్లు తెలిపింది. రిలయన్స్ కంపెనీ విస్తరణ, రుణ చెల్లింపులు, స్టాక్ మార్కెట్లో అరంగేట్రం కోసం సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెట్టుబడిదారులు కలిగి ఉన్న షేర్లు సహా కంపెనీ పబ్లిక్ షేర్‌ హోల్డింగ్ విలువ కనీసం 25 శాతంగా ఉండాలనేది సెబీ నిబంధన. ప్రస్తుతం రిటైల్ వెంచర్స్ కంపెనీ విలువ రూ. 8.25 లక్షల కోట్లు ఉండగా, అదనంగా 8-10 శాతం ఈక్విటీని తగ్గించడంతో ఐపీఓను మరింత సమర్థంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు RRVL వివరించింది.