LOADING...
Mutual Fund: రూ.1 లక్ష పెట్టుబడితో జీవితాంతం నెలకు రూ.17,500.. ఇందులో నిజమెంత?
రూ.1 లక్ష పెట్టుబడితో జీవితాంతం నెలకు రూ.17,500.. ఇందులో నిజమెంత?

Mutual Fund: రూ.1 లక్ష పెట్టుబడితో జీవితాంతం నెలకు రూ.17,500.. ఇందులో నిజమెంత?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలా మంది చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తారు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ ఆలోచనను తప్పుబడుతున్నారు. ఉదాహరణకు, కేవలం రూ.1 లక్షను ఒకేసారి (లంప్సమ్) మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, అది కాలక్రమంలో కోట్లాదిగా పెరగడమే కాకుండా, ప్రతి నెలా ఒక స్థిరమైన ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.

Details

రూ.1 లక్షతో రూ.17,500 నెలవారీ ఆదాయం సాధ్యమేనా? 

ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో రూ.1లక్ష పెట్టుబడి పెట్టి, సగటున 12శాతం వార్షిక రాబడి వస్తుందని అనుకుందాం. 30ఏళ్ల తర్వాత ఈ మొత్తం సుమారుగా రూ.30 లక్షలకు పెరుగుతుంది. పన్నులు పోగా దాదాపు రూ.26.5 లక్షలు మిగులుతాయి. ఆ మొత్తాన్ని సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా హైబ్రిడ్ లేదా డెట్ ఫండ్స్‌లోకి మార్చుతారు. ఈ ఫండ్స్ సాధారణంగా స్థిరమైనవే, సగటున 7% రాబడిని ఇస్తాయి. ఈ ప్లాన్‌తో, మీరు 30 సంవత్సరాల పాటు ప్రతీ నెలా రూ.17,500 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొత్తం మీద, కేవలం రూ.1 లక్ష పెట్టుబడితో సుమారు రూ.63లక్షల వరకు పొందవచ్చు. అంటే చిన్న పెట్టుబడులు కూడా ఎంత శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది.

Details

పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఎప్పుడంటే..?

పెట్టుబడికి ఒక నిర్దిష్ట సమయం ఉండదు. అయితే, ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత త్వరగా పెట్టుబడి పెడితే, అంత త్వరగా మీ డబ్బు పెరుగుతుంది. దీనికి కారణం కాంపౌండింగ్ శక్తి. పెట్టుబడిపై వచ్చిన రాబడి కూడా మళ్లీ రాబడిని తెచ్చిపెడుతుంది. ఈ విధంగా మీ సంపద గణనీయంగా పెరుగుతుంది.

Details

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ vs లంప్సమ్ - ఏది మంచిది? 

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP): ప్రతీ నెలా ఒక నిర్ణీత మొత్తం పెట్టుబడి పెట్టే విధానం. ఇది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని అలవాటు చేస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను సమతుల్యం చేస్తుంది. లంప్సమ్ ఇన్వెస్ట్‌మెంట్: ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం. మార్కెట్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈ పద్ధతి లాభదాయకం. చిన్న పెట్టుబడి.. పెద్ద భవిష్యత్! నిపుణుల అభిప్రాయం ప్రకారం, SIP గానీ, లంప్సమ్ గానీ సరైన విధంగా ఉపయోగిస్తే చిన్న పెట్టుబడులతోనే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. అయితే పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.