Page Loader
Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్‌ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా 
సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా

Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్‌ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 16, 2023
06:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్‌ హఠాన్మరణం చెందారు. ఈ మేరకు సహారా కేసులో సెబీ (SEBI) సంచలన నిర్ణయం తీసుకుంది. సహారా కంపెనీ ఛైర్మన్, సుబ్రతారాయ్‌ మరణం తర్వాత కూడా సహారా కేసు కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. సహారా అంశం సంస్థకు సంబంధించిన వ్యవహారం అని సెబీ చీఫ్‌ వివరించారు. సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌ హఠాన్మరణం చెందినా, గ్రూప్‌ సంస్థపై ఉన్న కేసు తొలగిపోదని సెబీ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు సెబీ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న నిధుల అంశం తెరపైకి వచ్చింది.దీనిపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) స్పష్టతనిచ్చింది. సుబ్రతా రాయ్‌ భౌతికంగా లేకపోయినా ఈ కేసు కొనసాగుతుందని ఛైర్‌పర్సన్‌ మాధబి పురీ బచ్‌ పేర్కొన్నారు.

details

సహారా వ్యక్తిగతమైంది కాదు : సైబీ ఛైర్ పర్సన్ ధబి పురీ బచ్‌

మంబైలో ఫిక్కీ (FICCI)కి సంబంధించిన ఓ కార్యక్రమంలో భాగంగా సహారా అంశంపై ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సహారా సంస్థకు సంబంధించిన అంశమని, వ్యక్తిగతమైన విషయం కాదన్నారు. రాయ్ వ్యక్తి ఉన్నా లేకపోయినా కేసు సాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో సహారాకు చెందిన రూ.వేలాది కోట్ల ఉన్నాయి. గడిచిన 11 ఏళ్లలో రూ.138 కోట్లను మాత్రమే మదుపర్లకు సెబీ వెనక్కి ఇచ్చేసింది. ఈ మేరకు వడ్డీతో కలిపి సెబీ అజమాయిషీలోని ఖాతాలోనే ఇంకా రూ. 25 వేల కోట్లు ఉన్నాయి. ఇంత తక్కువ మొత్తంలో మాత్రమే రిఫండ్ జరగడంపై మీడియా ప్రశ్నలు లేవనెత్తింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి మదుపరులు సమర్పించిన సాక్ష్యాల మేరకు తిరిగి చెల్లింపులు జరుగుతున్నాయని ఛైర్‌పర్సన్‌ అన్నారు.