Samsung: రూ. 8 బిలియన్ వారసత్వ పన్ను చెల్లించిన శాంసంగ్ కుటుంబం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీ శాంసంగ్ కుటుంబం భారీగా 12 ట్రిలియన్ వోన్‌లు (సుమారు 8 బిలియన్ డాలర్లు) వారసత్వ పన్నుగా చెల్లించింది. ఈ మొత్తం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఇన్హెరిటెన్స్ ట్యాక్స్‌గా నిలిచింది. కంపెనీ చైర్మన్ Lee Jae-yong, కుటుంబ సభ్యులు ఐదు సంవత్సరాల పాటు ఆరు విడతల్లో ఈ పన్ను చెల్లించారు. ఈ పన్ను 2020 అక్టోబర్‌లో మరణించిన మాజీ చైర్మన్ Lee Kun-hee ఆస్తులకు సంబంధించినది.
వివరాలు
శాంసంగ్ కార్యకలాపాలు.. దివంగత ఛైర్మన్ ఆస్తి
ఎలక్ట్రానిక్స్ నుంచి నిర్మాణం, ఫైనాన్స్ వరకు విస్తరించిన వ్యాపారాలతో శాంసంగ్ దక్షిణ కొరియాలో అతిపెద్ద కుటుంబ ఆధారిత సంస్థగా నిలిచింది. లీ కున్-హీ సుమారు 26 ట్రిలియన్ వోన్‌ల విలువైన షేర్లు, ఆస్తులు, కళా సంపదను వదిలి వెళ్లారు. ఈ వారసత్వ పన్ను చివరి విడత చెల్లింపును ఆదివారం శాంసంగ్ అధికారికంగా నిర్ధారించింది. ఇది 2024లో దక్షిణ కొరియా మొత్తం వారసత్వ పన్ను ఆదాయంతో పోలిస్తే దాదాపు ఒకన్నర రెట్లు ఎక్కువగా ఉంది.
వివరాలు
ప్రపంచవ్యాప్త AI విప్లవం నడుమ భారీగా పెరిగిన లీ కుటుంబ సంపద
లీ కుటుంబం విడుదల చేసిన ప్రకటనలో "పన్నులు చెల్లించడం ప్రతి పౌరుడి సహజ కర్తవ్యం" అని పేర్కొంది. Bloomberg Billionaires Index ప్రకారం, వారి మొత్తం ఆస్తుల విలువ 45 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. గ్లోబల్‌గా AI రంగంలో చిప్స్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా శాంసంగ్ షేర్ల విలువ పెరిగి, గత ఏడాదిలో కుటుంబ సంపద రెట్టింపు అయింది.