SBI: రోజుకు రూ.8.20 ఖర్చుతో కుటుంబానికి కొండంత అండ.. ఎస్‌బీఐ ప్రమాద బీమా పథకం
ఈ వార్తాకథనం ఏంటి
సామాన్య ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో దేశంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వినూత్న ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో కేవలం ఏడాదికి రూ.3,000 ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా రూ.60 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. అంటే రోజుకు సుమారు రూ.8.20 మాత్రమే ఖర్చు చేస్తే, అనుకోని పరిస్థితుల్లో మీ కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం అందినట్టే. ఈ బీమా పాలసీ కేవలం ప్రమాద మరణానికి మాత్రమే పరిమితం కాకుండా,బాధిత కుటుంబానికి అవసరమైన అనేక అదనపు సాయాలను కూడా అందిస్తోంది. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందితే, నామినీకి మొత్తం రూ.60 లక్షల బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.
వివరాలు
ఏఏ ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుంది?
కుటుంబాధిపతిని కోల్పోయిన సందర్భంలో ఇద్దరు పిల్లల చదువు కోసం అదనంగా రూ.20,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.10,000 మంజూరు చేస్తారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవల కోసం రూ.1,500 వరకు ఖర్చును భరిస్తారు.
రోడ్డు ప్రమాదాలు లేదా వాహన ప్రమాదాలు
వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు
పాము కాటు లేదా ఇతర విషజీవుల వల్ల సంభవించే మరణాలు
భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాల కారణంగా జరిగే మృతులు
వివరాలు
ఈ పరిస్థితుల్లో బీమా వర్తించదు
అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా సంభవించే మరణాలు
ఉద్దేశపూర్వక ఆత్మహత్యలు లేదా స్వీయ హానిచర్యలు
మద్యం లేదా మత్తుపదార్థాల ప్రభావంలో వాహనం నడిపి జరిగిన ప్రమాదాలు
చట్టవిరుద్ధమైన లేదా నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలు
క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
ప్రమాదం జరిగిన వెంటనే లేదా మరణం సంభవించిన వెంటనే సంబంధిత హోమ్ బ్రాంచ్‌కు సమాచారం ఇవ్వాలి.
మరణ ధ్రువీకరణ పత్రం, ఎఫ్.ఐ.ఆర్ కాపీ, పోస్ట్‌మార్టం నివేదిక, కేవైసీ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.
బ్యాంక్,న్సూరెన్స్ సంస్థ అధికారులు పత్రాలను పరిశీలించిన తరువాత అన్ని అర్హతలు సరిపోతే నేరుగా నామినీ ఖాతాలో బీమా మొత్తం జమ చేస్తారు.
వివరాలు
ఈ బీమాకు ఎలా అప్లై చేయాలి?
ఎస్‌బీఐ ఖాతాదారులు తమకు దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి ఒకసారి అంగీకార పత్రంపై సంతకం చేస్తే చాలు.
ప్రతి సంవత్సరం ప్రీమియం మొత్తం మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అయ్యే సదుపాయం ఉండటంతో ప్రతీసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.