Loading...
SBI customer alert: అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్‌.. ఐదోసారి నగదు తీస్తే ఛార్జీ
అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్‌.. ఐదోసారి నగదు తీస్తే ఛార్జీ

SBI customer alert: అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్‌.. ఐదోసారి నగదు తీస్తే ఛార్జీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారులకు అక్టోబర్‌ 1, 2026 నుంచి నగదు ఉపసంహరణపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నెలలో నాలుగు నగదు ఉపసంహరణలు మాత్రమే ఉచితంగా ఉంటాయి. ఐదోసారి నగదు తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్‌టీ చెల్లించాలి. ఏటీఎంలు, శాఖలు, ఏఈపీఎస్‌ ద్వారా చేసే ఉపసంహరణలు కూడా ఈ పరిమితిలోనే లెక్కిస్తారు. కొత్త నిబంధన ఎవరికి వర్తిస్తుంది? ఈ మార్పు ఎస్‌బీఐలోని అన్ని సాధారణ సేవింగ్స్‌ ఖాతాలకు వర్తించదు. కేవలం 'బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌' (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఖాతా వినియోగదారులు నెలలో చేసే నగదు ఉపసంహరణలను ఇకపై మరింత జాగ్రత్తగా లెక్కించుకోవాల్సి ఉంటుంది.

వివరాలు 

నాలుగు ఉచిత ఉపసంహరణల్లో ఏవేవి?

ఎస్‌బీఐ ఏటీఎంతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి తీసుకునే నగదు కూడా ఈ నాలుగు ఉచిత ఉపసంహరణల్లోకి వస్తుంది.

అలాగే బ్యాంకు శాఖలో నగదు తీసుకోవడం, ఏఈపీఎస్‌ (ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌) ద్వారా నగదు ఉపసంహరించుకోవడం కూడా లెక్కలోకి వస్తాయి.

ఒక నెలలో మొత్తం నాలుగు సార్లు ఉచితంగా నగదు తీసుకున్న తర్వాత మరోసారి ఉపసంహరణ చేస్తే రూ.15 రుసుముతో పాటు జీఎస్‌టీ వసూలు చేస్తారు.

వివరాలు 

అక్టోబర్‌ 1 నుంచే అమలు

ఎస్‌బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త నిబంధనలు 2026 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

ఇప్పటివరకు నాలుగు ఉచిత లావాదేవీల పరిమితిలో డిజిటల్‌ లావాదేవీలకు మినహాయింపు ఉండేది.

తాజా మార్పుల్లో ఆ మినహాయింపును తొలగించారు. దీంతో బీఎస్‌బీడీ ఖాతాదారులు తమ నెలవారీ లావాదేవీలను ముందుగానే గమనించుకోవడం అవసరం.

బీఎస్‌బీడీ ఖాతా ప్రత్యేకతలు

బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ ఖాతాకు కనీస నిల్వ నిబంధన ఉండదు. అయితే ఈ ఖాతాకు చెక్‌బుక్‌ సదుపాయం అందుబాటులో ఉండదు.

ఖాతాదారులకు రూపే ఏటీఎం-కమ్‌ డెబిట్‌ కార్డును ఉచితంగా అందిస్తారు.

అంతేకాకుండా బీఎస్‌బీడీ ఖాతా ఉన్న వ్యక్తి ఎస్‌బీఐలో మరో సేవింగ్స్‌ ఖాతాను కలిగి ఉండకూడదని బ్యాంకు స్పష్టం చేసింది.

ADVERTISEMENT