Loading...
SBI FD interest rates: ఎస్బీఐ మరో కీలక ప్రకటన.. బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో కోత
ఎస్బీఐ మరో కీలక ప్రకటన.. బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో కోత

SBI FD interest rates: ఎస్బీఐ మరో కీలక ప్రకటన.. బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో కోత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కొన్ని టెన్యూర్లకు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు 2026 ఆగస్టు 15 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే రూ.3కోట్లలోపు చేసే సాధారణ రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇటీవలే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు సంబంధించి కొత్త ఛార్జీలను ఎస్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకు,ఏటీఎం,డిజిటల్ మార్గాల్లో నెలకు నాలుగు ఉచిత నగదు ఉపసంహరణ లావాదేవీలు పూర్తయిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

వివరాలు 

బల్క్ ఎఫ్‌డీలపై 25 బేసిస్ పాయింట్ల వరకు కోత

ఈ ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది.

ఎంపిక చేసిన కాలపరిమితుల్లో బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఎస్బీఐ గరిష్ఠంగా 25బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.

ముఖ్యంగా 7 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ ఉన్న బల్క్ ఎఫ్‌డీలపై 25బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించింది.

180రోజుల నుంచి 210రోజుల కాలపరిమితి ఉన్న బల్క్ డిపాజిట్లపై మాత్రం 10బేసిస్ పాయింట్ల కోత విధించింది.

దీంతో ఈ టెన్యూర్‌పై వడ్డీ రేటు 5.60శాతం నుంచి 5.50శాతానికి తగ్గింది.

మరోవైపు 211 రోజుల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు ఉండే బల్క్ ఎఫ్‌డీల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

వివరాలు 

ఏ టెన్యూర్‌కు ఎంత వడ్డీ?

7 నుంచి 14 రోజుల కాలపరిమితి ఉన్న బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4.50 శాతం నుంచి 4.25 శాతానికి తగ్గించింది.

15 నుంచి 45 రోజుల డిపాజిట్లపై 5 శాతంగా ఉన్న వడ్డీని 4.75 శాతానికి చేర్చింది.

అలాగే 46 నుంచి 179 రోజుల టెన్యూర్ ఉన్న బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 5.10 శాతం నుంచి 4.85 శాతానికి తగ్గించింది.

180 నుంచి 210 రోజుల డిపాజిట్లపై 5.60 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గించింది.

211 రోజుల నుంచి పదేళ్ల వరకు ఉన్న ఇతర టెన్యూర్లకు మాత్రం పాత వడ్డీ రేట్లే కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

రిటైల్ ఎఫ్‌డీ రేట్లలో మార్పు లేదు

ప్రస్తుతం ఎస్బీఐలో సాధారణ ఖాతాదారులకు ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్ ఉన్న బల్క్ డిపాజిట్లపై గరిష్ఠంగా 6.25 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

సీనియర్ సిటిజెన్లకు సాధారణ రేట్ల కంటే అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ప్రయోజనం అందుతోంది. దీంతో వారికి గరిష్ఠంగా 6.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

రూ.3 కోట్లలోపు మొత్తంతో చేసే సాధారణ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.

ADVERTISEMENT

వివరాలు 

రిటైల్ ఎఫ్‌డీ రేట్లలో మార్పు లేదు

వారం రోజుల నుంచి పదేళ్ల వరకు ఉన్న టెన్యూర్లలో సాధారణ ఖాతాదారులకు వడ్డీ రేట్లు 3.05 శాతం నుంచి 6.40 శాతం వరకు ఉన్నాయి.

సీనియర్ సిటిజెన్లకు ఇదే కాలపరిమితుల్లో 3.55 శాతం నుంచి 7.05 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.

సాధారణ ఖాతాదారులకు రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్ ఉన్న రిటైల్ ఎఫ్‌డీలపై గరిష్ఠంగా 6.40 శాతం వడ్డీ రేటు ఉంది.

సీనియర్ సిటిజెన్లకు ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్ ఉన్న ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.05 శాతం వడ్డీ అందుతోంది.

ADVERTISEMENT