
SBI Home Loan Rates: ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీరేట్ల పెంపు.. కొత్త కస్టమర్లకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణగ్రాహకులకు షాకిచ్చింది. తాజాగా హోమ్ లోన్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్టు ప్రకటించింది. ఈ పెంపు కొత్త రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తుందని, సవరించిన వడ్డీరేట్లు ఇప్పటికే ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. కాలవ్యవధి ఆధారంగా గృహ రుణాలపై వడ్డీరేట్లలో తేడాలు ఉంటాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ రుణాల వడ్డీరేట్లు 7.50% నుంచి 8.45% మధ్యలో ఉండగా, తాజా మార్పుల తర్వాత 7.50% నుంచి 8.70% వరకు పెరిగాయి. ముఖ్యంగా తక్కువ సిబిల్ స్కోరు ఉన్న కస్టమర్లకు ఇకపై అధిక వడ్డీరేట్లపై రుణాలు అందనున్నాయి.
Details
కొత్త కస్టమర్లకే ఈ పెంపు అనుమతి
'సిబిల్ స్కోరు, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ఆధారంగా వడ్డీరేట్లలో మార్పులు చేశాం.గృహ రుణాలపై మార్జిన్ పెంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే, ఈ పెంపు కేవలం కొత్త కస్టమర్లకే వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ఎలాంటి మార్పు ఉండదని బ్యాంక్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ మేరకు ఎస్‌బీఐ అధికారిక ప్రకటన చేయలేదు. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గృహ రుణ వడ్డీరేట్లలో సవరణలు చేసింది. గతంలో7.35శాతంగా ఉన్న రేటును 10బేసిస్ పాయింట్లు పెంచి7.45శాతంగా నిర్ణయించింది. ఎస్‌బీఐ త్వరలోనే ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా హోమ్ లోన్ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.