Page Loader
SBI: ఎస్‌బీఐ అరుదైన ఘనత.. దేశంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపిక
ఎస్‌బీఐ అరుదైన ఘనత.. దేశంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపిక

SBI: ఎస్‌బీఐ అరుదైన ఘనత.. దేశంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు పొందింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్, SBIని 'బెస్ట్ బ్యాంక్'గా ఎంపిక చేయడం గమనార్హం. వాషింగ్టన్‌లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశంలో 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డుల కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందించనున్నారు. అసాధారణ సేవలు అందించడం, కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో తమ బ్యాంక్ ముందంజలో ఉందని ఎస్‌బీఐ ఉందని ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపు ఎస్బీఐ సేవా నాణ్యతను, కస్టమర్ సంతృప్తిని ముద్రించడంలో కీలకంగా ఉందని, ఇది బ్యాంక్ ప్రతిష్టను పెంచుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.