
SBI Q1 results: మొదటి త్రైమాసికంలో రూ.19,160 కోట్లు నికర లాభంతో అదరగొట్టిన ఎస్‌బీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా త్రైమాసిక ఫలితాలతో బలమైన ప్రదర్శన కనబర్చింది. మార్కెట్ అంచనాలను మించి రాణించిన ఈ బ్యాంక్,2025-26 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.19,160 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదు చేసిన రూ.17,035కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 12 శాతం పెరుగుదలగా నిలిచింది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ఆదాయం ద్వారా ఎస్‌బీఐ రూ.1.17 లక్షల కోట్లను ఆర్జించింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1.11 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం అధికం.
వివరాలు
ఎస్‌బీఐ షేర్లలో రికవరీ
అదే సమయంలో,ఈ త్రైమాసికంలో ఖాతాదారులకు వడ్డీ రూపంలో ఎస్‌బీఐ రూ.76,923 కోట్లను చెల్లించింది. ఇది గతేడాది ఇదే కాలంలో చెల్లించిన రూ.70,401 కోట్ల కంటే ఎక్కువ. మార్కెట్ ట్రేడింగ్ సమయంలోనే ఫలితాలను ప్రకటించడంతో ఎస్‌బీఐ షేర్లు కొంత రికవరీ చూపించాయి. ఇంట్రాడే కనిష్ఠమైన రూ.790 నుంచి కోలుకొని, ప్రస్తుతం రూ.802 వద్ద ట్రేడవుతున్నాయి.