Page Loader
SBI: ఎస్‌బీఐ కీలక ప్రకటన.. రుణ,డిపాజిట్‌ వడ్డీ రేట్లు తగ్గింపు
ఎస్‌బీఐ కీలక ప్రకటన.. రుణ,డిపాజిట్‌ వడ్డీ రేట్లు తగ్గింపు

SBI: ఎస్‌బీఐ కీలక ప్రకటన.. రుణ,డిపాజిట్‌ వడ్డీ రేట్లు తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈనెల 15వ తేదీ నుండి రుణాలు,డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సవరణలు కొత్త రుణగ్రహీతలతో పాటు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా వర్తిస్తాయి. తాజాగా చేసిన నిర్ణయం మేరకు, బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్లు (0.50 శాతం) తగ్గిస్తోంది. దీంతో రెపో రేటుకు అనుసంధానమైన రుణ వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) ఇప్పుడు 7.75 శాతానికి దిగివచ్చింది. దీని వల్ల వినియోగదారులకు గృహరుణాలు తక్కువ వడ్డీతో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత రుణ వడ్డీ రేటు (ఈబీఎల్‌ఆర్‌) కూడా 50 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించి, 8.15 శాతంగా నిర్ణయించబడింది.

వివరాలు 

డిపాజిట్ల వడ్డీపై ప్రభావం: 

ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన నిర్ణయానికి అనుగుణంగా, ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదిలీ చేయడం ద్వారా సిబిఐ తీసుకున్న చర్యగా పేర్కొనవచ్చు. రూ.3 కోట్లలోపు విలువ గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అన్ని కాల పరిమితులకు సంబంధించి వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. తాజా రేట్ల ప్రకారం: 1 నుంచి 2 ఏళ్ల మధ్య వ్యవధి గల డిపాజిట్లకు 6.50% వడ్డీ 2-3 ఏళ్ల మధ్య డిపాజిట్లకు 6.45% వడ్డీ 3-5 ఏళ్ల మధ్య కాలానికి 6.30% వడ్డీ 5-10 ఏళ్ల వ్యవధి గల డిపాజిట్లకు 6.05% వడ్డీ అందించనుంది.

వివరాలు 

అమృత్‌ వృష్టి ప్రత్యేక పథకం: 

వృద్ధుల విషయంలో ప్రత్యేక ప్రయోజనాలుగా,60 ఏళ్లు పైబడిన ఖాతాదారులకు పై రేట్లపై అదనంగా 0.50 శాతం వడ్డీ లభించనుంది. ఇక 80 ఏళ్లు దాటిన వారికి అదనంగా 0.60 శాతం వడ్డీ వర్తించనుంది. బ్యాంక్ ప్రవేశపెట్టిన ప్రత్యేక డిపాజిట్‌ పథకం అయిన 444 రోజుల "అమృత్‌ వృష్టి" పథకంపై వడ్డీ రేటును 6.60 శాతంగా నిర్ణయించింది.