Page Loader
SBI Har Ghar Lakpati RD:ఎస్ బి ఐ హర్‌ఘర్‌ లఖ్‌పతి RD స్కీమ్‌..నెలకు రూ.2,500 కట్టి రూ.1 లక్ష పొందండి 
ఎస్ బి ఐ హర్‌ఘర్‌ లఖ్‌పతి RD స్కీమ్‌..నెలకు రూ.2,500 కట్టి రూ.1 లక్ష పొందండి

SBI Har Ghar Lakpati RD:ఎస్ బి ఐ హర్‌ఘర్‌ లఖ్‌పతి RD స్కీమ్‌..నెలకు రూ.2,500 కట్టి రూ.1 లక్ష పొందండి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిపాజిట్లను పెంచుకోవడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన "హర్ ఘర్ లఖ్‌పతి" పథకం కింద రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద, వినియోగదారులు తాము ఎంచుకున్న కాలవ్యవధికి నెలనెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సాధారణ ఆర్‌డీతో పోలిస్తే, ఈ స్కీమ్‌లోని ప్రధాన భిన్నత ఏమిటంటే, ఇది ప్రీ-కాలిక్యులేటెడ్ రూపంలో ఉంటుంది. అంటే, మీకు భవిష్యత్‌లో రూ.1 లక్ష, రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షలు అవసరమని నిర్ణయించుకుని, దానికి అనుగుణంగా నెలవారీ డిపాజిట్లు చేయవలసి ఉంటుంది.

వివరాలు 

అర్హతలు: 

భారతీయ నివాసితులు వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గా ఈ ఆర్‌డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు కూడా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా ఖాతాను తెరవగలరు. ఈ స్కీమ్‌ కాలవ్యవధి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పెనాల్టీలు: నిర్ణీత కాలానికి ముందే రూ.5 లక్షల్లోపు విత్‌డ్రా చేస్తే 0.50% ప్రిన్సిపల్‌పై పెనాల్టీ ఉంటుంది. రూ.5 లక్షలు పైబడితే 1% పెనాల్టీ చెల్లించాలి. డిపాజిట్ చెల్లింపులో విఫలమైతే, ప్రతి రూ.100కు నెలకు రూ.1.50 చొప్పున పెనాల్టీ విధించబడుతుంది. వరుసగా ఆరు నెలల పాటు చెల్లింపులు జరపకపోతే ఖాతాను మూసివేసి, సంబంధిత మొత్తం చందాదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు.

వివరాలు 

ఎంత డిపాజిట్ చేయాలి? వడ్డీ రేట్లు: 

రూ.1 లక్ష పొందాలంటే 3 సంవత్సరాల కాలవ్యవధికి సాధారణ పౌరుడు నెలకు రూ.2,500 చెల్లించాలి. అదే 4 సంవత్సరాలకు గానూ నెలకు రూ.1,810 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల కాలానికి వడ్డీ రేటు 6.75%. కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేటులో మార్పులు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీ లభిస్తుంది, అంటే అదనంగా 50 బేసిస్ పాయింట్లు. ఎస్‌బీఐ ఉద్యోగులకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు చొప్పున మొత్తం 7.75% వడ్డీ అందుతుంది. ఈ పథకం ద్వారా భవిష్యత్ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చని ఎస్‌బీఐ ప్రతినిధులు పేర్కొన్నారు.