Page Loader
Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్‌ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 2014లో హనీ ట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించి, ఉద్యోగం నుంచి తొలగించారని బోవి కమ్యూనిటీకి చెందిన ఐఐఎస్‌సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఆరోపించారు. దుర్గప్ప మాట్లాడుతూ, ఐఐఎస్‌సీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా పనిచేసిన సమయంలో తనపై కులపరమైన విమర్శలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

Details

బెంగళూరులో ఎఫ్ఆర్ నమోదు

ఈ ఆరోపణల నేపథ్యంలో 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌ గానీ, ఐఐఎస్‌సీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులుగా ఉన్న ఇతరులెవరూ ఎటువంటి ప్రకటన చేయలేదు. కేసులో నిందితులుగా ఉన్నవారిలో గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పీ, హేమలతా మిషీ, ఛటోపాద్యాయ కే, ప్రదీప్ డీ సావ్కర్, మనోహరన్ వంటి వ్యక్తుల పేర్లు ఉన్నాయి.