Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ వివాదం.. సెబీ బాస్‌కు పీఏసీ సమన్లు
సెబీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24న కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. అదానీ గ్రూప్ సంబంధిత వివాదంలో సెబీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నియంత్రణ సంస్థల పనితీరును సమీక్షించాలనే ఉద్దేశంతో పీఏసీ ఈ సమన్లు ఇచ్చినట్లు సమాచారం. మాధబితో పాటు ఆర్థిక శాఖ, టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఛైర్మన్‌లకు కూడా సమన్లు జారీ చేయడం గమనార్హం. సెబీ చీఫ్‌పై వివిధ ఆరోపణల నేపథ్యంలో ఈ సమన్లు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో అనుకున్న ప్రకటనలపై సెబీ ఎలాంటి చర్యలు తీసుకుందనే అంశం చర్చనీయాంశంగా మారింది.
మాధరి పురీ బచ్ పై సెబీ అధికారులు ఫిర్యాదులు
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ వ్యక్తిగతంగా ఈ కమిటీ ముందు హాజరుకావడం కష్టమని భావిస్తున్నా, ఆమె తరఫున సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో సెబీ కార్యాలయంలో పని చేసే కొన్ని అధికారులు కూడా మాధబి పురీ బచ్ పై ఫిర్యాదులు చేశారు. దీంతో సెబీకి సంబంధించి ఇటీవల వివాదాలు మరింత కఠినంగా మారాయి. అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా మాధబి బచ్, ఆమె భర్త ధావల్ బచ్ మీద పలు ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను బచ్ దంపతులు కొట్టిపారేశారు.