అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ
గౌతమ్ అదానీ సోదరుడితో లింక్‌లు ఉన్న కనీసం మూడు ఆఫ్‌షోర్ సంస్థలతో అదానీ గ్రూప్ లావాదేవీలలో 'సంబంధిత పార్టీ' లావాదేవీ నిబంధనల ఉల్లంఘనపై భారతదేశ మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేస్తోంది. గత 13 సంవత్సరాలుగా బిలియనీర్ గౌతమ్ అదానీ స్థాపించిన పోర్ట్స్-టు-పవర్ గ్రూప్ అన్‌లిస్టెడ్ యూనిట్లతో ఈ మూడు సంస్థలు అనేక పెట్టుబడి లావాదేవీలను జరిపాయి. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి ఆ మూడు ఆఫ్‌షోర్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కొన్ని వర్గాలు తెలిపాయి, రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) సంబంధిత పార్టీ లావాదేవీ నిబంధనలను ఉల్లంఘించారా అనేదానిపై పరిశీలిస్తోంది.
లిస్టెడ్ అదానీ ఎంటిటీలలో వినోద్ అదానీకు ఎటువంటి పదవి లేదు
భారతీయ చట్టాల ప్రకారం, లిస్టెడ్ కంపెనీల ప్రత్యక్ష బంధువులు, ప్రమోటర్ గ్రూపులు, అనుబంధ సంస్థలు సంబంధిత పార్టీలుగా పరిగణిస్తారు. ప్రమోటర్ గ్రూప్ అనేది లిస్టెడ్ కంపెనీలో పెద్ద వాటా ఉన్న, కంపెనీ విధానాన్ని ప్రభావితం చేయగల ఎంటిటీ. వినోద్ అదానీ అదానీ కుటుంబంలో సభ్యుడు,ప్రమోటర్ గ్రూప్‌లో భాగమని, అయితే లిస్టెడ్ అదానీ ఎంటిటీలలో లేదా వాటి అనుబంధ సంస్థలలో అతనికి ఎటువంటి నిర్వాహక పదవి లేదని అదానీ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. పబ్లిక్ షేర్‌హోల్డింగ్, సంబంధిత పార్టీ నియమాలు లేదా రెగ్యులేటరీకు సంబంధించిన ఏవైనా లోపాల ఉంటే అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేయాలని భారత సుప్రీంకోర్టు మార్చిలో సెబీని కోరింది.