LOADING...
Anil Ambani: అనిల్ అంబానీ రిలయన్స్ పవర్‌పై మూడేళ్లపాటు SECI నిషేధం
అనిల్ అంబానీ రిలయన్స్ పవర్‌పై మూడేళ్లపాటు SECI నిషేధం

Anil Ambani: అనిల్ అంబానీ రిలయన్స్ పవర్‌పై మూడేళ్లపాటు SECI నిషేధం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు (Reliance Power) భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థలపై సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) మూడు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం కారణంగా, భవిష్యత్తులో మూడు సంవత్సరాల పాటు ఈ సంస్థ SECI నిర్వహించే బిడ్డింగ్‌లలో పాల్గోలేదు. SECI గత జూన్ నెలలో 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కోసం బిడ్లు ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ NU BESS పాల్గొంది.

వివరాలు 

అనిల్ అంబానీపై ఐదు సంవత్సరాల పాటు సెబీ నిషేధం   

కానీ చివరి రౌండ్ బిడ్డింగ్‌లో ఆ సంస్థ నకిలీ గ్యారెంటీలు సమర్పించినట్లు SECI దర్యాప్తులో తేలింది. దీంతో SECI ఆ బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసి, తక్షణమే సంస్థపై చర్యలు తీసుకుంది. ఈ నిషేధంతో అనిల్ అంబానీకి మరో పెద్ద సమస్య ఎదురైంది. ఈ ఏడాది ఆగస్టులోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆయనపై ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో నిషేధం విధించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో రూ. 25 కోట్ల జరిమానా కూడా విధించింది. అక్టోబర్‌లో సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ సెబీ పెనాల్టీ వసూలు చేయకుండా ఆపినప్పటికీ, ఆయనపై నిషేధం కొనసాగుతోంది.