
Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.
గత ట్రేడింగ్ సెషన్‌లో పెద్దగా లాభపడిన సూచీలు, ఈ రోజు మాత్రం నెగెటివ్‌గా మారాయి.
మదుపర్లు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు కిందకి జారుకున్నాయి.
ముఖ్యంగా ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కీలక కంపెనీల షేర్లలో విక్రయాలు పెరగడం సూచీల నష్టానికి దారితీసింది.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 547 పాయింట్లు కోల్పోయి 81,887 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద కదులుతోంది.
వివరాలు
సెన్సెక్స్ 30 సూచీలో షేర్ల స్థితిగతులు
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఇన్ఫోసిస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మరోవైపు సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ షేర్లు మాత్రం లాభాల్లో కదలాడుతున్నాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రస్తుత పరిస్థితి
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.74 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర ఔన్సుకు 3,238 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం... వాల్ స్ట్రీట్ లో లాభాల జోరు
వాణిజ్య వివాదాన్ని తగ్గించేందుకు అమెరికా,చైనా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి.
రెండు దేశాలు తమ తమ దిగుమతి టారిఫ్‌లను తగ్గించనున్నట్లు ప్రకటించడంతో ఇది మార్కెట్‌లకు అనుకూలంగా ప్రభావితం చేసింది.
ఫలితంగా అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. డోజోన్స్ సూచీ 2.8 శాతం పెరిగి 42,410.10 వద్ద ముగిసింది.
ఎస్ అండ్ పీ 500 సూచీ 3.3 శాతం పెరిగి 5,844.19కి చేరుకుంది. నాస్‌డాక్ సూచీ 4.35 శాతం లాభంతో ముగిసింది.
వివరాలు
ఆసియా-పసిఫిక్ మార్కెట్ల మిశ్రమ ట్రెండ్
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమ ధోరణిలో కదలాడుతున్నాయి.
ఆస్ట్రేలియాలో ASX సూచీ 0.52 శాతం, జపాన్‌లో నిక్కీ సూచీ 1.73 శాతం, చైనాలో షాంఘై సూచీ 0.14 శాతం లాభాల్లో ఉన్నాయి.
అయితే హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ మాత్రం 1.72 శాతం నష్టంతో ట్రేడవుతోంది.
ఎఫ్ఐఐలు, డీఐఐల పెట్టుబడులు
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.1246 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
అలాగే దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1448 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.