Loading...
Stock Market: ఆరంభంలో జోరు.. ఆ తర్వాత బేజారు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఆరంభంలో జోరు.. ఆ తర్వాత బేజారు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: ఆరంభంలో జోరు.. ఆ తర్వాత బేజారు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేశీయ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే సూచీలు గరిష్ఠ స్థాయులకు చేరిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడంతో మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి.

వివరాలు 

సెన్సెక్స్ పరిస్థితి ఇదీ..

బీఎస్ఈ సెన్సెక్స్ గత ముగింపు 83,919.71 పాయింట్లతో పోలిస్తే సోమవారం ఉదయం 84,421.97 వద్ద లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది.

కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో 84,662.96 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరుకుంది. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ నష్టాల్లోకి వెళ్లింది.

ఒక దశలో 600 పాయింట్లకు పైగా పడిపోయి 83,210.08 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ, 276.48 పాయింట్లు (0.33 శాతం) నష్టంతో 83,643.23 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

నిఫ్టీ కూడా అదే బాటలో..

ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం ఉదయం 25,929.15 వద్ద లాభాలతో ప్రారంభమైంది.

ఇంట్రాడేలో 25,992.60 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాల్లోకి జారుకుంది.

ఒకానొక సమయంలో 25,600 పాయింట్ల దిగువకు పడిపోయి 25,567.30 కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

ప్రస్తుతం 94 పాయింట్లు (0.36 శాతం) నష్టంతో 25,706.60 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, మిడ్‌క్యాప్ షేర్లలో అమ్మకాలు

బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు జరగడంతో బ్యాంక్ నిఫ్టీ 2 శాతానికి పైగా పతనమైంది.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోనూ ప్రతికూల పరిస్థితులు కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు దాదాపు ఒక్కో శాతం చొప్పున నష్టపోయాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఐటీ మినహా అన్ని రంగాలూ నష్టాల్లోనే..

నిఫ్టీ ఐటీ సూచీ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ముఖ్యంగా నిఫ్టీ మెటల్ సూచీ 2 శాతానికి పైగా పడిపోవడంతో అత్యధిక నష్టాలు నమోదు చేసిన రంగంగా నిలిచింది.

పీఎస్‌యూ బ్యాంక్, ఆటోమొబైల్, రియాల్టీ, ఫార్మా, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

టాటా స్టీల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ షేర్లు కూడా అమ్మకాల ప్రభావానికి గురయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు 

మార్కెట్ల పతనానికి కారణాలివే..

దేశీయ మార్కెట్లలో అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణాల్లో లాభాల స్వీకరణ ఒకటి.

గత నాలుగు వారాలుగా స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలను నమోదు చేశాయి.

దీంతో సూచీలు గరిష్ఠ స్థాయులకు చేరిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై లాభాలను అందుకునేందుకు షేర్ల విక్రయాలకు దిగారు.

మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ట్రేడింగ్‌పై నెలకొన్న ఆందోళనలు కూడా అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి.

గత వారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నాస్‌డాక్ సూచీ 5.28శాతం, ఎస్‌అండ్‌పీ 500సూచీ 3.70శాతం,డౌ జోన్స్ 1.93శాతం మేర పతనమయ్యాయి.

అమెరికా మార్కెట్లలో నెలకొన్న ఈ ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఆసియా మార్కెట్లపైనా పడింది. దీంతో సోమవారం ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ADVERTISEMENT