Stock Market: అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన సూచీలు,ఆ తరువాత క్రమంగా అమ్మకాల ఒత్తిడికి లోనై పడిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, వాహన రంగాలకు చెందిన షేర్లలో భారీగా విక్రయాలు జరగడం సూచీలపై ప్రభావం చూపింది. అమెరికా-ఇరాన్ చర్చల పురోగతిపై ఉన్న అనిశ్చితి కూడా పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో సూచీలు ఉదయం గరిష్ఠ స్థాయిల నుంచి గణనీయంగా పడిపోయాయి. సెన్సెక్స్ ఉదయం 78,677.56పాయింట్ల వద్ద ప్రారంభమై,గత ముగింపు 78,111.24తో పోలిస్తే లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 78,730.32 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.అయితే మధ్యాహ్నం తరువాత పరిస్థితి మారి, అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ 77,674.93పాయింట్ల కనిష్ఠానికి జారుకుంది.
వివరాలు
బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 96.30 డాలర్లు
చివరకు 122.56 పాయింట్ల నష్టంతో 77,988.68 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 34.55 పాయింట్లు తగ్గి 24,196.75 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.22గా నమోదైంది. సెన్సెక్స్‌లోని ప్రధాన షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు ట్రెంట్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 96.30 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సుకు 4808 డాలర్ల వద్ద వ్యాపారం జరుగుతోంది.