LOADING...
Stock market: స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. సెన్సెక్స్ 2400 పాయింట్లు పతనం,నిఫ్టీ 23,800 దిగువకు
సెన్సెక్స్ 2400 పాయింట్లు పతనం,నిఫ్టీ 23,800 దిగువకు

Stock market: స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. సెన్సెక్స్ 2400 పాయింట్లు పతనం,నిఫ్టీ 23,800 దిగువకు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. ఫలితంగా ప్రారంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 23,800 స్థాయికి దిగువన ట్రేడవుతోంది.

వివరాలు 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.25గా నమోదు 

ఉదయం సుమారు 9.27 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 2,400 పాయింట్లు పడిపోయి 76,505 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 726 పాయింట్లు తగ్గి 23,724 స్థాయిలో కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 92.25 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో ప్రస్తుతం కోల్ ఇండియా షేర్ మాత్రమే లాభాల్లో ట్రేడవుతోంది. కాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement