Loading...
Stock Market: వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. అమెరికా కొత్త టారిఫ్‌ల ప్రకటన నేపథ్యంలో రోజంతా మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కనిపించాయి. ఒక దశలో లాభాల్లోకి వెళ్లిన సూచీలు మరోసారి నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, ఐటీ, మెటల్, ప్రైవేటు బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 390.31 పాయింట్లు పెరిగి 84,328.59 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 65.25 పాయింట్లు లాభపడి 25,884.50 వద్ద స్థిరపడింది.

వివరాలు 

రూపాయి 92.44గా నమోదు 

సెన్సెక్స్-30లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాలను నమోదు చేశాయి.

మరోవైపు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, బంగారం ధరలు కూడా కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.44గా నమోదైంది.

అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 94.13 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు ధర 3,561 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT