LOADING...
Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్
భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్

Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కనిపించిన కొనుగోళ్లతో సూచీలకు స్పష్టమైన మద్దతు లభించడంతో వరుసగా రెండు రోజులు నమోదైన నష్టాలకు ముగింపు పలికింది. ఉదయం నష్టాల్లోనే 82,480.40 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ క్రమంగా పుంజుకుని లాభాల బాట పట్టింది. చివరకు 650 పాయింట్లు పెరిగి 83,277.15 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద స్థిరపడింది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 67.44 డాలర్లు 

డాలరుతో రూపాయి మారకం విలువ 90.66గా నమోదైంది. సెన్సెక్స్‌-30లో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడగా, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ట్రెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 67.44 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 5,033 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement