LOADING...
Stock market: ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌.. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌.. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock market: ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌.. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌కు సంబంధించి శుక్రవారం ఫ్రేమ్‌వర్క్‌ ఖరారవడంతో ఇన్వెస్టర్లలో ఆశావహ వాతావరణం కొనసాగింది. త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు దాదాపు 8 శాతం వరకు ఎగబాకాయి. ఒక దశలో మార్కెట్‌ భారీగా ఉత్సాహం చూపగా, సెన్సెక్స్‌ సుమారు 700 పాయింట్ల వరకు లాభపడింది. బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే రూ.6 లక్షల కోట్ల మేర పెరిగి రూ.473 లక్షల కోట్లకు చేరుకుంది.

వివరాలు 

డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.74గా నమోదు 

సెన్సెక్స్‌ ఉదయం 84,177.51 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,580.40) పాజిటివ్‌గా ప్రారంభమైంది. ట్రేడింగ్‌ సమయంలో 84,314.68 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన అనంతరం, చివరికి 485.35 పాయింట్ల లాభంతో 84,065.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 173.60 పాయింట్లు పెరిగి 25,867.30 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.74గా కొనసాగింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఎస్‌బీఐతో పాటు టైటాన్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎటెర్నల్‌ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ఒత్తిడికి లోనై నష్టాలతో ముగిశాయి.

Advertisement